పాఠశాల ఖాతాలకు అమ్మఒడి విరాళాలు

పాఠశాల ఖాతాలకు అమ్మఒడి విరాళాలు

పాఠశాలల్లో పారిశుధ్య పనుల కోసం విద్యార్థుల తల్లిదండ్రులనుంచి వసూలు చేస్తున్న విరాళాలను పాఠశాల ఖాతాలకే జమ  చేయా లని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ గురువారం ఉత్త ర్వులు జారీచేశారు. ఈ విషయాన్ని డీఈవో వీఎస్‌ సుబ్బారావు ఒక ప్రకటనలో తెలిపారు. అమ్మఒడి పథకం కింద పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లు ఖాతా లకు జమఅయిన రూ.15వేలల్లో వెయ్యి రూపాయలు పాఠశాలల పారిశుఽధ్య నిర్వహణకు విరాళంగా ఇవ్వాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.

విరాళాలను డీఈవో, సమగ్రశిక్ష ఆదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్‌  జాయింట్‌ ఖాతాలో జమ చేయమన్నారు. జోన్‌1 పరిధిలో ఉన్న శ్రీకాకుళం,విజయనగరం, విశాఖపట్నం జిల్లాల ప్రధానో పాధ్యాయులు అమ్మఒడి విరాళాలను పాఠశాలల ఖాతా లోనే జమచేసేలా చర్యలు తీసుకోమని విద్యాశాఖ కార్య దర్శికి విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం పాఠశాలల ఖాతాలోనే అమ్మఒడి విరాళాలను డిపాజిట్‌ చేయడానికి అంగీకరించింది. దీనికోసం పాఠశాల ప్రధా నోపాధ్యాయుడు, తల్లిదండ్రుల కమిటీ ఛైర్మన్‌ పేరుతో బ్యాంకులో జాయింట్‌ఖాతా  ప్రారంభించి అమ్మఒడి విరా ళాలతోపాటు ఇతర విరాళాలను జమ చేయనున్నారు.  పారిశుధ్య పనులకు వాటిని వినియోగించనున్నారు.
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Top