- లాక్ డౌన్ తర్వాత నిర్ణయం
10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ఏప్రిల్ చివరి వారంలో లేదా మే మొదటివారం లో నిర్వహించే అవకాశం. ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడినవి తొలుత మార్చి 23 నుండి నిర్వహించాలని అనుకున్నరు స్థానిక సంస్థల ఎన్నికల కారణంగా మార్చి 31 నుండి నిర్వహించాలని అనుకున్నారు లాక్ డౌన్ కారణంగా మరల వాయిదా పడినవి ఈ పరీక్షల కొత్త షెడ్యూల్ లాక్‌డౌన్ ఎత్తి వేసిన తర్వాత ప్రకటించనున్నారు. కరోనా వైరస్ (కోవిండ్-19) వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా ఈ నెల 14 వరకు లాక్‌డౌన్ కొనసాగనున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే విద్యార్థులందరికీ హాల్ టికెట్స్ మంజూరు చేశారు . ఒకటో తరగతి నుండి ఐదవ తరగతి విద్యార్థులకు ఇప్పటికే సమ్మేటివ్ పరీక్షలు నిర్వహించారు ప్రభుత్వం 6 తరగతి నుండి 9 తరగతి వరకు వారి హాజరు ఆధారంగా పై తరగతులకు ప్రమోట్ చేయడానికి ఉత్తర్వులు జారీ చేసినది. ఇంకా ప్రభుత్వ అధికారిక ఉత్తర్వులు విడుదల కావాలిసి ఉన్నది.



Learn a Word September 2022 Schedule
0 comments:
Post a Comment