LTC Leave Travel Concession లీవ్ ట్రావెల్ కన్సెషన్

లీవ్ ట్రావెల్ కన్సెషన్ ( L T C)

    ప్రభుత్వ ఉద్యోగి సెలవుపై అతని కుటుంబముతో కలసి ఉద్యోగ ప్రదేశము (హెడ్ క్వార్టర్) నుండి స్వస్థలము(హోంటౌన్)నకు గాని, రాష్ట్రములోని ఏ ప్రదేశమునకైనాగాని వెళ్ళివచ్చుటకు అగు ప్రయాణ ఖర్చులను చెల్లించుటనే
“లీవ్ ట్రావెల్ కన్ఫెషన్"(LTC) అంటారు. సర్వీస్ మొత్తంలో ఒకసారి బ్లాక్ పీరియడ్లోని చివరి రెండు సంవత్సరాల్లో
దేశంలోని ఏ ప్రదేశానికైనా వెళ్ళువచ్చుటకు అనుమతించబడింది.

*1. అర్హత* : 5 సం||ల కనీస సర్వీసుగల టెంపరరీ ఉద్యోగులతో సహా ఉద్యోగులతో సహా అర్హులు. కంటిజెంట్ సిబ్బంది, పార్ట్ టైమ్ ఉద్యోగులు దీనికి అర్హులు కారు.

*2. స్వస్థలం (Home Town)*: ఉద్యోగి జన్మస్థలం లేదా అతని తల్లిదండ్రులు, దగ్గర బంధువులు నివసించు స్థలము లేదా
ఉద్యోగి స్థిరాస్తి కలిగియున్న స్థలము, ఉద్యోగములో చేరకముందు నివాసమున్న స్థలము స్వస్థలముగా
పరిగణించబడుతుంది. ఉద్యోగి తాను మొదటిసారిగా ఎల్టీసి వాడుకొనే ముందు స్వస్థలము ధృవీకరిస్తూ నిర్ణీతఫారంలో డిక్లరేషన్ ఇవ్వాలి. దానిని కంట్రోలింగ్ అధికారి అప్రూవ్ చేసి కార్యాలయాధిపతి (Head of Office)కి
పంపినచో, వారు దానిని సర్వీసు రిజిష్టరులో నమోదు చేస్తారు. ఉపాధ్యాయులకు ఎంఇఓ / ప్రధానోపాధ్యాయుడు,
ప్రధానోపాధ్యాయులకు డివైఇఓ నమోదు చేయాలి. ఈ డిక్లరేషనను సర్వీస్ మొత్తంలో ఒకసారి మార్చుకోవచ్చు.

*3. కుటుంబం*: టీఏ నిబంధనలలో నిర్వచించబడిన కుటుంబమే దీనికి కూడా వర్తిస్తుంది. ఉద్యోగి, అతని కుటుంబము
వేర్వేరుగాని, కలిసిగాని ఎల్టీసి వాడుకొన వచ్చును. ఉద్యోగి కుటుంబము వేరే చోట నివాసముంటూ ఈ సౌకర్యం
ఉపయోగించు కొనకపోతే అట్టి ఉద్యోగి స్వస్థలము వెళ్ళి వచ్చుటకు ఎల్‌సి వాడుకొనవచ్చును. భార్యా, భర్తలు కలసి
వాడుకొనేప్పుడు ఒక్కరే ఎల్టీసి అర్హులు. కుటుంబ సభ్యులు ఒక బ్లాక్ పీరియడ్లో ఒకసారి మాత్రమే ఎల్ టీసికి
అర్హులు. ఈ సౌకర్యం సంతానంలో ఇద్దరికే పరిమితం చేయబడింది.

*4. బ్లాక్ పీరియడ్*: ప్రతి 4 సం||ల కాలము ఒక బ్లాక్ పీరియడ్ గా పరిగణించబడుతుంది. మొదటి రెండు సంవత్సరముల
నందు స్వస్థలము పోవుటకు, తదుపరి రెండు సంవత్సరాల కాలంలో రాష్ట్రంలోని ఏ ప్రదేశమునకైనా గాని, లేక
హోంటౌనుగాని, సర్వీస్ మొత్తంలో ఒకసారి దేశంలో ఏ ప్రదేశానికైనా వెళ్ళి వచ్చుటకు ఎల్ టీసిని వినిగియోంచు
కొనవచ్చును. 2019-20 హోమ్ టౌను 2021-22లో రాష్ట్రంలో ఎక్కడికైనాఅనుమతి స్తారు. యుటిఎఫ్.

*5. తీసుకోవలసిన సెలవు* : క్యాజువల్ లీవుగాని, లేక అర్హతగల ఏ ఇతర సెలవుగాని పెట్టుకొని వెళ్ళాలి. ప్రభుత్వ సెలవు దినాలతో కలిపిగాని, కలపకుండా కాని వినియోగించు కోవచ్చు. కాని కేవలం ప్రభుత్వ సెలవుల్లో మాత్రమే వినియోగించు కోవటానికి వీలులేదు. అర్హతగల సెలవు మంజూరు చేయు అధికారి నుండి ఎల్ సి వాడుకొనుటకు
ముందస్తు పర్మిషన్ పొందాలి. వెకేషన్ డిపార్టుమెంటుకు చెందినవారు వెకేషన్లో కూడా ఈ సౌకర్యం వాడుకొనవచ్చును.

*6. అడ్వాన్సు* : ఎల్టీసి పై వెళ్ళి వచ్చుటకుగాను అంచనా వేయబడిన మొత్తం ఖర్చులో 80 శాతం వరకు అడ్వాన్సుగాపొందవచ్చు. మిగిలినది ప్రయాణం పూర్తి చేసి వచ్చి ఫైనల్ బిల్లు సమర్పించిన తర్వాత చెల్లిస్తారు.

*7. చెల్లింపబడే మొత్తం* : మొదటి 2 సం||లలో స్వస్థలమునకు వెళ్ళినప్పుడు గాని రెండవ బ్లాక్ పీరియడ్లో రాష్ట్రంలోని
ఏ చోటుకైనను వెళ్ళునప్పుడుగాని పూర్తి దూరమునకు చెల్లింపు ఉండును. ఇతర రాష్ట్రములలో స్వస్థలముగలవారు
ఉద్యోగం చేయు స్థలం నుండి మన రాష్ట్ర సరిహద్దు వరకు గల దూరమునకు మాత్రమే చెల్లింపు వుంటుంది. రైలు
మార్గముండి, ఏ ఇతర వాహనముపై ప్రయాణించినను, దగ్గరి రైలు మార్గము ద్వారా ప్రయాణం చేసినప్పుడు అయ్యెడిచార్జీలను (టీఏ నిబంధనల మేరకు)చెల్లిస్తారు. రైలు మార్గం లేనిచో బస్ (అర్హతను బట్టి డీలక్సు సర్వీసు వరకు)
చార్జీలను చెల్లిస్తారు. దేశంలోని ఏ ప్రదేశానికైనా వెళ్లే సందర్భంలో ప్రయాణ దూరం 3500 కి.మీ., క్లెయిమ్ మొత్తం
18,750/-లు గరిష్టంగా అనుమతిస్తారు. nkr.

*8. క్లెయిమ్ చేయుట* : ఎల్ టీసి మొత్తమును క్లెయిమ్ చేయునప్పుడు టిఎ బిల్లునకు టిక్కెట్లను గాని, క్యాష్ రశీదుగాని,
స్వంత డిక్లరేషన్‌గాని, బస్సు టికెట్లుగాని జత పరచవలెను. తిరుగు ప్రయాణం పూర్తి అయిన 30 రోజులలోగా
బిల్లును పంపుకోవాలి. లేనిచో 15 శాతం కోత విధించబడుతుంది. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయులకు
ఎంఇఓ, ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులకు ప్రధానోపాధ్యాయుడు, ప్రధానోపాధ్యాయులకు ఉపవిద్యాశాధికారి
మంజూరు అధికారిగా ఉంటారు.
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top