State Bank of India SBI పిపియల్ లోన్ మేళా 45 నిమిషాల్లో లోన్ పొందండి

SBI పిపియల్ లోన్ మేళా!

 ▪️ప్ర‌ముఖ బ్యాంకింగ్ దిగ్గ‌జం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఊర‌ట‌నిచ్చే వార్త చెప్పింది. త‌మ వినియోగ‌దారుల‌కు స‌త్వ‌రం లోన్ మంజూరు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు చెప్పింది.

▪️ బ్యాంకుల‌కు వెళ్లే ప‌నిలేకుండా ఇంట్లో కూర్చుని లోన్ పొందే స‌దుపాయం ఎస్‌బీఐ యోనో యాప్ ద్వారా క‌ల్పిస్తున్న‌ట్లు తెలిపింది. ఈ అత్య‌వ‌స‌ర లోన్‌లు ప్రీ అప్రూవ్‌డ్ ప‌ర్స‌న‌ల్ లోన్స్ (పీఏపీఎల్‌) లోన్‌లుగా పేర్కొంది.

▪️ త‌క్కువ వ‌డ్డీకే అంటే 7.25 శాతం వ‌డ్డీకే కేవ‌లం 45 నిమిషాల్లో లోన్ పొంద‌వ‌చ్చ‌ని తెలుపుతూ ఇటీవ‌లే ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.

▪️ లోన్ వాయిదాలు వెంట‌నే ప్రారంభంకావు. ఆరు నెల‌ల త‌ర్వాత నుంచి క‌ట్టాల్సి ఉంటుంది.

SMS పంపే విధానం: SMS PAPL <> <last 4 digits of A/c no.> to 567676 to check your eligibility.


ఎలా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి..


▪️ ఎస్‌బీఐ వినియోగ‌దారులు త‌మ‌కు లోన్ ఎలిజిబులిటీ ఉందో లేదో తెలుసుకునేందుకు త‌మ రిజిస్ట‌ర్డ్ మొబైల్ నుంచి 567676 నంబ‌రుకు PAPL అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి త‌మ అకౌంట్ నంబ‌రులోని చివ‌రి నాలుగు అంకెల‌ను ఎంట‌ర్ చేసి మెసేజ్ పంపాల్సి ఉంటుంది. త‌రువాత ప్రీ అప్రూవ్డ్ ప‌ర్స‌న‌ల్ లోన్ పొందేందుకు అర్హ‌త ఉందీ లేనిదీ తెలుపుతూ మెసేజ్ వ‌చ్చేస్తుంది. ఆ త‌రువాత ఎస్‌బీఐ యోనో యాప్ డౌన్‌లోడ్ చేసుకుని లోన్ పొంద‌వ‌చ్చు. నిరంత‌రం ఈ స‌దుపాయం అందుబాటులోనే ఉంటుంద‌ని ఆయ‌న తెలిపారు.

ఇలా సుల‌భంగా లోన్ పొందండి...

1. స్టేట్ బ్యాంక్ యోనో యాప్ మొబైల్‌లో డౌన్‌లోడ్ చేసుకుని లాగిన్ అవ్వండి.
2.యాప్ ఓపెన్ చేయండి.
3. కాల వ్య‌వ‌ధి, ఎంత లోన్ తీసుకోవాల‌నుకుంటున్నారో ఎంచుకొని, వివ‌రాలు న‌మోదు చేయండి.
4. రిజిస్ట‌ర్ మొబైల్ నంబ‌ర్‌కు వ‌చ్చిన ఓటీపీ న‌మోదు చేసి, క్లిక్ చేయండి. అంతే న‌గ‌దు మీ ఖాతాలో నిర్ణీత సమ‌యంలో జ‌మ‌వుతుంది.
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top