6 EMI లు వాయిదా వేస్తే 16 EMI లు కట్టాలి

▪️రిజర్వ్ బ్యాంక్ ఆప్ ఇండియా-RBI అన్ని టర్మ్ లోన్ల ఈఎంఐలపై మరో మూడు నెలలు మారటోరియం పొడిగించిన సంగతి తెలిసింది.

▪️ఇప్పటికే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI తమ కస్టమర్లకు ఈఎంఐ వాయిదా వేసే అవకాశాన్ని కల్పించింది.

▪️అంటే కరోనా వైరస్ సంక్షోభం కారణంగా మార్చి 1 నుంచి మే 31 వరకు మొదటి విడత, జూన్ 1 నుంచి ఆగస్ట్ 31 వరకు రెండో విడత మారటోరియం ఎంచుకునే అవకాశం కస్టమర్లకు లభించింది.

Auto Loan: 


▪️ఓ వ్యక్తి రూ.6 లక్షల ఆటో లోన్ తీసుకున్నాడని అనుకుందాం. ఇంకా 54 నెలలు ఈఎంఐ చెల్లించాలి. మొదట మూడు నెలలు ఈఎంఐలు వాయిదా వేయడంతో పాటు మరో మూడు నెలలు మారటోరియం ఆప్షన్ ఎంచుకున్నాడు. ఆ వ్యక్తి అదనంగా రూ.36,000 వడ్డీ చెల్లించాలి. అంటే 3 ఈఎంఐలు అదనంగా చెల్లించాలి. ఒకవేళ ఆ వ్యక్తి ఇప్పుడే మొదటిసారి మారటోరియం ఎంచుకుంటున్నట్టైతే సుమారు రూ.19,000 వడ్డీ చెల్లించాలి. ఇది 1.5 ఈఎంఐతో సమానం.


Home Loan: 


▪️ఓ వ్యక్తి రూ.30 లక్షల హోమ్ లోన్ తీసుకున్నాడని అనుకుందాం. ఇంకా 15 ఏళ్లు ఈఎంఐలు చెల్లించాలి. ఆ వ్యక్తి మొదట మూడు నెలలతో పాటు మరో మూడు నెలలు మారటోరియం ఎంచుకున్నాడు. ఔట్‌స్టాండింగ్‌పై సుమారు రూ.4,54,000 వడ్డీ చెల్లించాలి. ఇది 16 ఈఎంఐలు అదనంగా చెల్లించాలి. ఒకవేళ ఆ వ్యక్తి ఇప్పుడే మొదటిసారి మారటోరియం ఎంచుకుంటున్నట్టైతే సుమారు రూ.2,34,000 వడ్డీ చెల్లించాలి. ఇది 8 ఈఎంఐలతో సమానం. అంటే రెండుసార్లు మారటోరియం ఆప్షన్ ఎంచుకొని 6 ఈఎంఐలు వాయిదా వేస్తే అదనంగా 16 ఈఎంఐలు కట్టాలి. అందుకే మారటోరియం ఆప్షన్ ఎంచుకుంటే నష్టం తప్ప లాభం లేదు. ఈఎంఐలు చెల్లించడానికి అస్సలు డబ్బులు లేని పరిస్థితి ఉంటేనే మారటోరియం ఎంచుకోవాలి. ఆర్థిక పరిస్థితి బాగుంటే ఈఎంఐలు చెల్లించడమే మేలు.
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Top