ప్రయాణీకులకు రైల్వే మంత్రిత్వ శాఖ నుండి విజ్ఞప్తి

ప్రయాణీకులకు రైల్వే మంత్రిత్వ శాఖ నుండి విజ్ఞప్తి

దేశంలో వలసదారులు తిరిగి త‌మ స్వ‌స్థాలాల‌కు వెళ్లేందుకు వీలుగా భారతీయ‌ రైల్వే దేశ వ్యాప్తంగా రోజూ శ్రామిక్ ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఈ ప్ర‌త్యేక రైళ్ల‌లో సేవను పొందుతున్న వారిలో కొంతమందికి ముందే ప‌లు ఆరోగ్య‌ప‌ర‌మైన ఇబ్బందులు ఉన్న‌ట్టుగా గుర్తించ‌బ‌డింది.. ప్ర‌స్తుత కోవిడ్‌-19  మ‌హ‌మ్మారి వ్యాప్తి నేప‌థ్యం వారు ఎదుర్కొనే ప్రమాదాన్ని పెంచుతుంది. ముందుగానే ఆరోగ్య‌ప‌ర‌మైన ఇబ్బందులు ఉన్న వారు తమ స్వ‌స్థలాల‌కు వెళ్లే ప్ర‌య‌త్నంలో భాగంగా దుర‌దృష్ట‌వ‌శాత్తుగా మృత్యువాత ప‌డుతున్న‌ సంఘ‌ట‌న‌లూ చోటు చేసుకున్నాయి. ఈ నేప‌థ్యంలో కోవిడ్‌-19 వ్యాప్తి నుండి దుర్బలమైన వ్యక్తులను రక్షించడానికి, 17.05.2020 వ తేదీ జారీ చేసిన హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆర్డర్ నెంబర్ 40-3 / 2020-డీఎం-I (ఏ) కు అనుగుణంగా, రైల్వే మంత్రిత్వ శాఖ ఒక విజ్ఞప్తి జారీ చేసింది. అనారోగ్య‌లు (ఉదాహరణకు - రక్తపోటు, మధుమేహం, హృద‌య సంబంధిత వ్యాధులు, క్యాన్సర్, రోగనిరోధక లోపం పరిస్థితులు), గర్భిణీ స్త్రీలు, 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు మరియు 65 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు రైలు ప్రయాణానికి దూరంగా ఉండాల‌ని కోరింది. అత్య‌వ‌స‌ర‌మైతే త‌ప్ప ప్ర‌యాణాల‌ను చేయ‌వ‌ద్ద‌ని  సూచించింది. కోవిడ్-19 వ్యాప్తి నేప‌థ్యంలో ప్రయాణం సాగించాల్సి ఉన్న భార‌తీయ పౌరులంద‌రికీ అవ‌స‌ర‌మైన రైలు సేవ‌ల‌ను అందించేందుకు గాను భారతీయ‌ రైల్వే పరివార్ 24 X 7 అంటే  నిరంత‌రాయంగా కృషి చేస్తోందని తెలిపింది. ఇదే సమ‌‌యంలో మా ప్రయాణీకుల భద్రత.. మా అతి పెద్ద ప్రాధాన్య‌త అని భార‌తీయ రైల్వే తెలిపింది. కాబట్టి, ఈ విషయంలో పౌరులందరి సహకారాన్ని మేము కోరుకుంటున్న‌ట్టుగా వెల్ల‌డించింది. ప్ర‌యాణాల‌కు సంబంధించి ఏదైనా ఇబ్బందులు లేదా అత్యవసర పరిస్థితుల్లో దయచేసి  రైల్వే పరివార్‌ను చేరుకోవడానికి వెనుకాడ‌కుండా (హెల్ప్‌లైన్ నంబర్ - 139 & 138) తెలి‌య‌జేస్తే తాము మీకు ఎప్పటిలాగే సహాయం చేస్తామ‌ని భార‌తీయ రైల్వే తెలిపింది.
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top