ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ శ్రీ మంత్రి ఆదిమూలపు సురేష్ గారు సంఘ నాయకులతో వీడియో కాన్ఫరెన్స్ ముఖ్యాంశాలు

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గారు, రాష్ట్ర విద్యా శాఖ అధికారులు శ్రీ సుబ్బారెడ్డి గారు, శ్రీ ప్రతాప్ రెడ్డి గారు మరియు ఇతర ఉన్నతాధికారులతోఈరోజు సంఘ నాయకులతో వీడియో కాన్ఫరెన్స్ జరిగింది.

ఈ కాన్ఫరెన్స్ లో పదవ తరగతి పరీక్షల పై, 2020-21 విద్యా సంవత్సరం అకడమిక్  క్యాలెండరు ,ఇంకా అజెండాలో లేకున్నా  బదిలీలపై వివిధ సంఘాల నాయకులు పాల్గొని సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది.

1) ప్రస్తుత COVID 19 నేపథ్యంలో పదవతరగతి పరీక్షలు FA1,  FA 2, FA3, FA4 మరియు SA 1 మార్కుల ఆధారంగా పాస్ చేయాలని సూచించడమైనది.

2) ఒకవేళ పరీక్షలు తప్పనిసరిగా నిర్వహించాలంటే ఏ స్కూలు ఆ స్కూల్ లోనే (Self center) సెంటర్ గా ఏర్పాటుచేసి  రాష్ట్రంలో విద్యార్థి ఎక్కడ చదువుతున్న వారు ఏ సెంటర్లో కోరుకుంటే లేదా ఏ సెంటర్ వద్ద నివాసము ఉంటే ఆ సెంటర్లో రాసే విధంగా చర్యలు తీసుకోవాలి.

3) పరీక్ష స్పాట్ వాల్యుయేషన్ విధానం యూనివర్సిటీలో జరిగే విధంగా ఇంటివద్దకే పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా పంపించి, ఇంటివద్దనే స్పాట్ వాల్యుయేషన్ చేయించి  తిరిగి పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా విద్యాశాఖకూ చేరే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించడమైనది.

4) పాఠశాల అకడమిక్ ఇయర్ ఆగస్టులో ప్రారంభించి దసరా సెలవులలో  సగం దినాలు, సంక్రాంతి సెలవుల్లో సగం దినాలు తగ్గించడం (రెండవ శనివారం ఆదివారాలు తప్పనిసరిగా సెలవు ఉండాలి),  ఏప్రిల్ 30 వరకు పాఠశాలను కొనసాగించాలి.

5) అలాగే పాఠశాల పనిదినాలు 220 నుండి కోవిడ్ నేపథ్యంలో 200 లకు తగ్గించాలి. అలాగే సిలబస్ను తగ్గించాలి.

6) బదిలీలు ఆన్లైన్ ద్వారా నిర్వహించి (పాఠశాల ప్రారంభం లోపల), రేషనలైజేషన్ గతంలో లాగా కాకుండా 1:20 or 1: 25 విధానంలో నిర్వహించాలని కోరడమైనది.

యుటిఎఫ్ ప్రతిపాదనలు
మిత్రులారా!
  ఈరోజు గౌరవనీయులైన విద్యాశాఖ మంత్రి  గారు ఉపాధ్యాయ సంఘాలతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడటం జరిగింది.
 పదో తరగతి పరీక్షల నిర్వహణ, అకడమిక్ క్యాలెండర్ ఎలా ఉండాలి అనేది ప్రధానమైన అజెండా గా ఈ సమావేశం జరిగింది.
యుటిఎఫ్  నుంచి  రాష్ట్ర అధ్యక్షులు షేక్ సాబ్జీ, ప్రధాన కార్యదర్శి పి.బాబురెడ్డి పాల్గొన్నారు.  *పరీక్షలు నిర్వహణ గురించి
  యుటిఎఫ్ అభిప్రాయంగా
లాక్ డౌన్ ముగిసిన   రెండు వారాలు తర్వాత పరీక్షలు నిర్వహించాలని, విద్యార్థులు ప్రయాణం చేయడం సాధ్యం కాదు కావున ప్రయాణ సౌకర్యం ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. అలాగే ఏ పాఠశాల విద్యార్థులు ఆ పాఠశాలలోనే పరీక్షలు రాసే విధంగా సెంటర్లు ఏర్పాటు చేయాలని,ఇన్విజిలేటర్స్ ని ఇతర పాఠశాలల నుంచి డ్యూటీ వేయాలని తెలియజేయడం జరిగింది. అలాగే ప్రతి గదికి కేవలం 12 మంది విద్యార్థులు ఉండేలా రూములు ఏర్పాటు  చేయాలని, పాఠశాలల్లో రూములు చాలకపోతే అదే ఊరిలో ప్రైవేటు పాఠశాలలు, కాలేజీలు సెంటర్లు గా ఏర్పాటు చేయాలని కోరాము. ప్రతి రోజూ పరీక్ష సెంటర్లు శుభ్రం చేయాలని, విద్యార్థుల కు మాస్క్ లు,శానిటైజర్స్ అందించాలని  తెలియజేయడం జరిగింది.
సిటీల్లో వేలాది మంది విద్యార్థులు ప్రైవేటు, కార్పోరేట్ పాఠశాలల్లో హాస్టల్లో ఉండి చదువుతున్నారు.
వారికి కూడా వారు నివాసం ఉంటున్న ప్రాంతాల్లో ఉన్న సెంటర్లు లో పరీక్షలు వ్రాసేందుకు ఆప్షన్ ఇవ్వాలని సూచించడం జరిగింది.
కరోనా తీవ్రత పెరిగి పరీక్షలు జరపలేని పరిస్థితి ఏర్పడితే అప్పుడు ప్రత్యామ్నాయం గా పదో తరగతిలో పెట్టినటువంటి
ఎఫ్ ఏ, ఎస్ ఏ పరీక్షల  మార్కులు  సరాసరి గా తీసుకొని పాస్ చేయాలని తెలియజేయడం జరిగింది. ఇప్పుడు ఉన్న పరీక్ష పాస్ మార్కులు తగ్గించాలని మన సంఘం తరఫున ప్రతిపాదించాము.

 అకడమిక్ క్యాలెండర్

జూన్ 12 తర్వాత కరోనా తీవ్రతను  బట్టి ప్రారంభించాలని, ఎప్పుడు ప్రారంభించిన ఏప్రిల్ 30 నాటికి ముగించాలని తెలిపాము. వర్కింగ్ డేస్
తగ్గిన పరిస్థితుల్లో అవసరమైతే దసరా సంక్రాంతి సెలవులు కుదించాలని  తెలియజేయడం జరిగింది.
 అలాగే  అవసరమైతే విద్యార్థులు ఎక్కువగా ఉన్న చోట షిఫ్ట్ పద్ధతుల్లో తరగతులు నిర్వహించవచ్చు అని  తెలియజేయడం జరిగింది.

బదిలీలు గురించి

 పాఠశాలలు తెరిచే లోగా ఈ సెలవుల్లో నే ఉపాధ్యాయులకు ఆన్లైన్లో అయినా బదిలీలు నిర్వహించే విధంగా షెడ్యూల్ ప్రకటించాలని కోరడం జరిగింది. అదేవిధంగా పాఠశాలల్లో విద్యార్థులు పెరిగిన చోట టీచర్లు లేరు ఇటువంటి పాఠశాలలు గుర్తించి  అరవై దాటిన ఇటువంటి ప్రతి ప్రాధమిక పాఠశాలలో ఐదుగురు టీచర్లు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది.
 
సర్వీస్ రూల్స్

 పెండింగ్ లో ఉన్నాయి. మార్చి లో కమీషనర్ గారు ఏర్పాటు చేసిన సమావేశంలో చర్చలు ఆధారంగా ప్రభుత్వం హైకోర్టు కు వెళ్లి సర్వీస్ రూల్స్ పై స్టాటిస్కో రద్దు చేయించాలని, ఈలోగా

డిప్యూటీ డీఈవో ఎంఈఓ పోస్టులకు సీనియర్ ప్రధానోపాధ్యాయులను  ఎఫ్ ఏ సి ద్వారా నియమించాలి అని కోరడం జరిగింది.
   చివరగా మంత్రిగారు మాట్లాడుతూ  సంఘాలు ఇచ్చిన ప్రతిపాదనలు అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామనిప్రకటించారు.

యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top