దేశ‌వ్యాప్తంగా గ‌ల విద్యార్ధుల‌తో వెబినార్ ద్వారా మ‌ట్లాడిన కేంద్ర మాన‌వ వ‌న‌రుల అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ ర‌మేష్ పోఖ్రియాల్ నిశాంక్

దేశ‌వ్యాప్తంగా గ‌ల విద్యార్ధుల‌తో వెబినార్ ద్వారా మ‌ట్లాడిన కేంద్ర మాన‌వ వ‌న‌రుల అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ ర‌మేష్ పోఖ్రియాల్ నిశాంక్
ఐఐటి, ఐఐటిలు, ఎన్ఐటిల‌లో 2020-21 సంవ‌త్స‌రాల‌కు ఫీజుల పెంపు లేదు-  శ్రీ‌ ర‌మేష్ పోఖ్రియాల్ నిశాంక్

నీట్ 2020 జూలై 26న నిర్వ‌హిస్తాం-:  శ్రీ‌ ర‌మేష్ పోఖ్రియాల్ నిశాంక్

జెఇఇ మెయిన్ ప‌రీక్ష 2020 జూలై 18,20,21,22,23 తేదీల‌లో జ‌రుగుతుంది-:శ్రీ‌ ర‌మేష్ పోఖ్రియాల్ నిశాంక్

యుజిసి నెట్‌-2020, జెఇఇ (అడ్వాన్స్‌డ్) ప‌రీక్ష‌ల తేదీలు త్వ‌ర‌లోనే వెల్ల‌డిస్తాం-:శ్రీ‌ ర‌మేష్ పోఖ్రియాల్ నిశాంక్
సిబిఎస్ి 12 వ‌తర‌గ‌తి బోర్డు ప‌రీక్ష‌ల తేదీలు రెండు రోజుల‌లో ప్ర‌క‌టిస్తాం- హెచ్‌.ఆర్‌.డి. మంత్రి

కేంద్ర మాన‌వ వ‌న‌రుల అభివృద్ది శాఖ మంత్రి శ్రీ ర‌మేష్ పోఖ్రియాల్ నిశాంక్ ఈరోజు దేశ‌వ్యాప్తంగా విద్యార్థుల‌తో వెబినార్ ద్వారా మాట్లాడారు. గంట పాటు మంత్రి విద్యార్థుల‌తో ముచ్చ‌డించిన సంద‌ర్భంగా ఆయ‌న విద్యార్దులు త‌మ స్కూలు ప‌రీక్ష‌లు, ఎంట్ర‌న్స్ ప‌రీక్ష‌లు, విద్యాసంవ‌త్స‌రం , ఆన్‌లైన్ బోధ‌న‌, ఫీజులు, ఫెలోషిప్, విద్యార్థుల మాన‌సిక స్థితి, అంత‌ర్జాతీయ విద్యార్థులకు సంబంధించిన అంశాలు త‌దిర విష‌యాలపై  అడిగిన ప‌లు ప్ర‌శ్న‌లు,సందేహాల‌కు ఆయ‌న స‌మాధాన‌మిచ్చారు.

ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ మంత్రి, ప్ర‌ధాన‌మంత్రి శ్రీ నరేంద్ర‌మోదీ, దేశంలోని విద్యార్థుల శ్రేయ‌స్సు, వారి విద్యా కార్య‌క‌లాపాలకు సంబంధించి ప్ర‌త్యేక శ్ర‌ద్ధ‌తో ఉన్నార‌ని, ఇందుకు అనుగుణంగా త‌మ మంత్రిత్వ‌శాఖ విద్యార్థుల స‌మ‌స్య‌ల‌ను స‌త్వ‌రం ప‌రిష్క‌రించేందుకు తమ ప్ర‌భుత్వం అవ‌స‌ర‌మైన అన్ని చ‌ర్య‌లూ తీసుకుంటున్న‌ద‌ని ఆయ‌న చెప్పారు. విద్యార్థుల‌కు నాణ్య‌మైన విద్య‌, వారి భ‌ద్ర‌త‌కు సంబంధించి కేంద్ర మాన‌వ వ‌న‌రుల శాక స‌హాయ‌మంత్రి శ్రీ సంజ‌య్ ధోత్రే అద్భుత‌మైన చ‌ర్య‌లు చేప‌ట్టార‌ని ఆయ‌న ప్ర‌శంసించారు

 విద్యార్ధుల‌తో స‌మావేశం సంద‌ర్భంగా కేంద్ర మాన‌వ వ‌న‌రుల అభివృద్ధిశాఖ మంత్రి, ప‌లు ఎంట్ర‌న్స్‌ప‌రీక్ష‌ల తేదీల‌ను ప్ర‌క‌టించారు. దీని ప్ర‌కారం, నీట్ 2020 జూలై 26న జ‌రుగుతుంది. జెఇఇ మెయిన్ ప‌రీక్ష జూలై 18,20,21,22,23 తేదీల‌లో జ‌రుగుతుంది. జెఇఇ (అడ్వాన్స్ ) ఆగ‌స్ట్‌లో నిర్వ‌హిస్తామ‌న్నారు. యుజిసి నెట్‌2020, సిబిఎస్ఇ 12 వ‌త‌ర‌గ‌తి బోర్డు ప‌రీక్ష‌ల తేదీల‌ను త్వ‌ర‌లోనే  ప్ర‌క‌టిస్తామ‌న్నారు.

విద్యార్థుల మాన‌సిక ఆరోగ్యానికి సంబంధించి మాట్లాడుతూ, విద్యార్థులు ప్ర‌శాంతంగా త‌మ చ‌దువుల‌పై దృష్టిపెట్టాల‌ని అన్నారు. విద్యార్ధులు టైంటేబుల్ రూపొందించుకుని మ‌ధ్య మ‌ధ్య‌లో విరామం తీసుకుంటూ ఉండాల‌ని  సూచించారు.ఎంట్ర‌న్స్ ప‌రీక్ష‌ల‌లో నెగ్గాలంటే సిల‌బ‌స్  ప‌రీక్షా విధానంపై అవ‌గాహ‌న ఉండాల‌ని చెప్పారు. విద్యార్థులు ఎలాంటి ఆందోళ‌న చెంద‌కుండా స‌క్ర‌మంగా ఆరోగ్య‌వంత‌మైన ఆహారం తీసుకుంటూ ఇళ్ళ‌లో సుర‌క్షితంగా ఉండాల‌ని సూచించారు.

ఎంట్ర‌న్స్ ప‌రీక్ష‌ల‌కు సిద్ధ‌మ‌య్యే విద్యార్థులు ఫిజిక్స్‌, కెమిస్ట్రీ,మాథ‌మాటిక్స్‌, బ‌యాల‌జీ వంటి వాటికి నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ అధికారిక లింక్ https://nta.ac.in/ లో ఉన్న లెక్చ‌ర్ల‌ను చూడ‌వ‌చ్చ‌ని చెప్పారు.
అలాగే మాన‌వ వ‌న‌రుల అభివృద్ధి మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన వివిధ ప్లాట్‌ఫాంల‌ను ఎంట్ర‌న్స్‌ల‌కు సిద్ధ‌మ‌య్యే విద్యార్థులు ఉప‌యోగించుకోవ‌చ్చ‌ని అన్నారు. వీటిలో స్వ‌యం ప్ర‌భ డిటిహెచ్ ఛాన‌ల్‌, స్వ‌యం ప్ర‌భ ఐఐటి పాల్, దీక్ష‌, ఇ పాఠ‌శాల‌, నేష‌న‌ల్ డిజిట‌ల్ లైబ్ర‌రీ స్వ‌యం, ఈ పిజిపాఠ‌శాల‌, శోధ‌గంగా, ఈ శోధ సింధు, ఇ యంత్ర‌, స్పోక‌న్ ట్యుటోరియ‌ల్స్‌, వ‌ర్చువ‌ల్ ల్యాబ్ల‌ను ఉప‌యోగించుకోవ‌చ్చ‌ని శ్రీ‌ర‌మేష్ పోఖ్రియాల్ నిశాంక్ సూచించారు.
 ఎన్.ఐ.టి, ఐఐటిలు, ఐఐఐటిలు 2020-21 సంవ‌త్స‌రాల‌లో ఫీజుల‌కు సంబంధించి అడిగిన ప్ర‌శ్న‌కు స‌మాధాన‌మిస్తూ మంత్రి ఐఐటిలు, ఐఐఐటిలు, ఎన్‌.ఐటిల‌లో 2020-21 సంవ‌త్స‌రంలో ఫీజుల పెంపు ఉండ‌బోద‌న్నారు.


2020-21 విద్యా సంవ‌త్స‌రానికి యు.జి., పి.జి కోర్సుల‌కు సంబంధించి అడ్మిష‌న్లు 2020 ఆగస్టు 31 లోగా పూర్తి కావ‌చ్చ‌ని మంత్రి చెప్పారు. అవ‌స‌ర‌మైతే ప్రొవిజ‌న‌ల్ అడ్మిష‌న్లు చేసి ఇందుకు సంబంధించిన క్వాలిఫైయింగ్ ప‌రీక్ష‌కు సంబంధించి డాక్యుమెంట్లు స‌మ‌ర్పించే గ‌డువును 30-09-2020 వ‌ర‌కు అనుమ‌తించే అవ‌కాశం ఉంద‌న్నారు. పాత విద్యార్థుల‌కు విద్యా సంవ‌త్స‌రాన్ని2020 ఆగస్టు 1నుంచి, కొత్త విద్యార్థుల‌కు 01-09-2020 నుంచి ప్రారంభ‌మౌతుంద‌న్నారు. మ‌రిన్ని వివ‌రాల‌కు యుజిసి వెబ్ సైట్ చూడ‌వ‌చ్చున‌ని చెప్పారు.

 దేశ‌వ్యాప్తంగా గ‌ల విద్యార్థుల‌తో ముచ్చ‌టించ‌డం ప‌ట్ల మంత్రి సంతోషం వ్య‌క్తం చేశారు. విద్యార్ధులు ఏమాత్రం ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని ఆయ‌న అన్నారు. విద్యార్ధుల భ‌ద్ర‌త‌, అక‌డ‌మిక్ వాతావ‌ర‌ణాన్ని ప‌రిర‌క్షించ‌డానికి త‌మ మంత్రిత్వ‌శాఖ క‌ట్టుబ‌డి ఉంద‌ని ఆయ‌న చెప్పారు. ప‌రీక్ష‌లు, అక‌డ‌మిక్ కేలండ‌ర్ త‌దిత‌ర అంశాల‌కు సంబంధించిన తాజా స‌మాచారం త‌మ మంత్రిత్వ‌శాఖ‌ వెబ్‌సైట్ లోనూ, దీనికి సంబంధించిన స్వ‌తంత్ర ప్ర‌తిప‌త్త‌గ‌ల సంస్థ‌ల  వెబ్‌సైట్లోనూ చూడ‌వ‌చ్చ‌ని చెప్పారు.
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top