Ministry of HRD తూర్పు ఢిల్లీ విద్యార్ధులకు మినహా దేశవ్యాప్తంగా పదవ తరగతి పరీక్షలు (CBSE) ఉండవని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి (హెచ్‌ఆర్‌డీ) మంత్రిత్వ శాఖ

 కోవిడ్‌-19 వ్యాప్తితో పదవ తరగతి పరీక్షల నిర్వహణ (CBSE) పై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. తూర్పు ఢిల్లీ విద్యార్ధులకు మినహా దేశవ్యాప్తంగా పదవ తరగతి పరీక్షలు ఉండవని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి (హెచ్‌ఆర్‌డీ) మంత్రిత్వ శాఖ మంగళవారం ట్వీట్ చేసింది

AP SSC Exams Nesw 


పాఠశాల విద్యాశాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం :: పత్రికా ప్రకటన                                         తేది: 05.5.2020

పదో తరగతి పరీక్షలపై వదంతులు నమ్మవద్దు

     పాఠశాల విద్యాశాఖ కమీషనర్ వాడ్రేవు చినవీరభద్రుడు
కోవిడ్-19 లాక్ డౌన్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రస్తుతానికి వాయిదా వేసిన సంగతి విధితమే. కొంతమంది ఈ నెల 15 నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలంటూ అనధికార టైమ్ టేబులును సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తూ వదంతులు సృష్టిస్తున్నారని, వాటిని నమ్మవద్దని పాఠశాల విద్యాశాఖ కమీషనర్ వాడ్రేవు చినవీరభద్రుడు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇలాంటి వదంతుల వల్ల విద్యార్థులు, తల్లిదండ్రులు ఒత్తిడికి గురవుతున్నారని ఆయన పేర్కొన్నారు. వదంతులు పుట్టించినవారిపై, షేర్ చేసినవారిపై క్రిమినల్ కేసులు పెడతామని తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రులు భయాందోళన చెందవద్దని విద్యాశాఖ కమీషనర్ స్పష్టం చేశారు. 

శ్రీ వాడ్రేవు చినవీరభద్రుడు, ఐ.ఏ.ఎస్

కమీషనర్, పాఠశాల విద్యాశాఖ (పూ.అ.బా.),  ఆంధ్రప్రదేశ్




Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top