ఆధార్ ఆధార ఈ - కె వై సి ద్వారా తక్షణ 'పాన్' జారీ సౌకర్యం ప్రారంభించిన ఆర్ధిక మంత్రి

            కేంద్ర వార్షిక బడ్జెటులో ప్రకటించిన విధంగా కేంద్ర ఆర్ధిక & కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ తక్షణం ఆదాయపు పన్ను ఖాతా సంఖ్య 'పాన్'  జారీ సౌకర్యాన్ని గురువారం ఢిల్లీలో (దాదాపు అప్పుడే ఇచ్చే పద్ధతిలో)  లాంఛనంగా ప్రారంభించారు.   చెల్లుబాటైన ఆధార్ సంఖ్య ఉండి  దానికి మొబైల్ నంబర్ నమోదై ఉన్న పాన్ దరఖాస్తుదారులకు ఈ సౌకర్యం లభ్యమవుతుంది.   ఈ కేటాయింపు ప్రక్రియ పూర్తిగా కాగితరహితం మరియు దరఖాస్తుదారులకు ఎలెక్ట్రానిక్ పాన్ నెంబరు (ఈ-పాన్)  ఉచితంగా జారీ చేయడం జరుగుతుంది. 

          2020 సంవత్సరపు కేంద్ర బడ్జెటులో ఆర్ధిక మంత్రి శ్రీమతి సీతారామన్ త్వరలో తక్షణ పాన్ సౌకర్యాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించిన సంగతి గుర్తుండే ఉంటుంది."గత బడ్జెటులో నేను పాన్ మరియు ఆధార్  పరస్పరము మార్చుకునే వీలు కల్పించాను.  దానికి అవసరమైన నియమాలను ఇదివరకే ప్రకటించడం జరిగింది.  పాన్ కేటాయింపు  ప్రక్రియను మరింత సులభతరం చేయడానికి త్వరలో మేము  ఎలాంటి దరఖాస్తు నింపవలసిన అవసరం లేకుండా ఆధార్ ఆధారంగా ఆన్ లైనులో తక్షణం పాన్ నెంబరు కేటాయించే పద్ధతిని ప్రారంభిస్తాము"  అని బడ్జెట్ ప్రసంగం 129వ పేరాలో ఆర్ధిక మంత్రి తెలిపారు.   

ఆధార్ ఆధార ఈ- కె వై సి ద్వారా తక్షణ 'పాన్'  జారీ సౌకర్యాన్ని గురువారం లాంఛనంగా  ప్రారంభించారు.   వాస్తవానికి దాని 'బీటా వెర్షన్'  ను  ఆదాయపు పన్ను శాఖ ఈ- ఫైలింగ్ వెబ్సైటులో 2020 ఫిబ్రవరి 20వ తేదీన ప్రారంభించి పరీక్షించి చూశారు.  అప్పటి నుంచి 2020 మే 25వ తేదీ వరకు 6,77,680 తక్షణ పాన్ నెంబర్లను కేటాయించడం జరిగింది.  తక్షణ పాన్ నెంబరు జారీకి 10 నిముషాలు పడుతోంది.

ఇంకొక విషయం ఏమిటంటే

25.05.2020 తేదీవరకు మొత్తం 50.52కోట్ల పాన్ నెంబర్లను పన్ను చెల్లింపుదారులకు కేటాయించడం జరిగింది.  వాటిలో దాదాపు
 49.39 పాన్ నెంబర్లను   వ్యక్తిగత చెల్లింపుదారులకు కేటాయించారు.   మరియు ఇప్పటివరకు 32.17 కోట్ల పాన్ నెంబర్లకు ఆధార్ సంఖ్యను జత చేయడం జరిగింది.   

తక్షణ పాన్ నెంబరు కోసం దరఖాస్తు చేయడం చాలా సులభం   తక్షణ పాన్ పొందదలచిన దరఖాస్తుదారు  ఆదాయపు పన్ను శాఖ ఈ- ఫైలింగ్ వెబ్సైటులో  ఆమె/ అతని చెల్లుబాటులో ఉన్న ఆధార్ సంఖ్యను పొందుపరచాలి.  మరియు ఆధార్ లో నమోదై ఉన్న మొబైల్ నెంబరుకు వచ్చిన ఓటిపిని సమర్పించాలి.ఈ  ప్రక్రియ పూర్తయిన తరువాత 15అంకెల దరఖాస్తు స్వీకరణ సంఖ్య ఉత్పత్తి అవుతుంది.  అవసరమైతే తమ దరఖాస్తు తాజా స్థితి ఏమిటో దరఖాస్తుదారు ఎప్పుడైనా ఆమె/ అతని చెల్లుబాటులో ఉన్న ఆధార్ సంఖ్యను పేర్కొని పరీక్షించి చూసుకోవచ్చు.   కేటాయింపు ప్రక్రియ విజయవంతంగా పూర్తయిన తరువాత తమ ఈ-పాన్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.   ఒక వేళ దరఖాస్తుదారు ఈ-మెయిల్ ఐ డి ఆధార్ వద్ద నమోదై ఉన్నట్లయితే ఈ-పాన్ ను ఆమె/అతని ఈ-మెయిల్ ఐడికి కూడా పంపుతారు.   

  తక్షణ పాన్ నెంబరు పొందే సౌకర్యం కల్పించడం డిజిటల్ ఇండియా దిశగా ఆదాయపు పన్ను శాఖ తీసుకున్న మరొక చర్య.  తద్వారా పన్ను చెల్లింపుదారులకు  నిబద్ధతతో వ్యవహరించడం మరింత సులభతరం అవుతుంది.
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top