జాతీయ జెండా నియమాలు

 జాతీయ జెండా నియమాలు

🚩2002 లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన గెజిట్ లోని ముఖ్యమైన విషయాలు ఇలా ఉన్నవి.

🚩జెండా ఎగురవేయడంలో నియమాలు తెలిసో తెలియకో కొన్ని లోటుపాట్లు జరుగుతున్నవి.కాగా రాజ్యాంగా స్పూర్తికి విరుద్ధంగా కొన్ని కార్యక్రమాలు చేయటం కూడా జరుగుచున్నది.

🚩Flag code of India సెక్షన్ V రూల్ ప్రకారం రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే సంధర్భంగా జెండాలో పూలుఫెట్టి ఎగుర వేయవచ్చు, పాఠశాల్లో 15 ఆగష్టున పాఠశాల పేరంట్స్ కమిటీ చైర్మన్ లు Covid-19 నిబంధనలు పాటిస్తూ జెండాను ఎగుర వేయాలి..


              సాధారణ నియమాలు


1.జాతీయ జెండా చేనేత ఖాది,కాటన్ గుడ్డతో తయారైనది ఉండాలి.

2.జెండా పొడవు 3:2 నిష్పత్తిలో ఉండాలి. 6300x4200 మి.మీ. నుండి 150x100 మి.మీ.వరకు మొత్తం 9 రకాలుగా పేర్కోనడం జరిగింది.

3ప్లాస్టిక్ జెండాలు అసలే వాడరాదు. 

4.పై నుండి క్రిందకు 3 రంగులు సమానంగా ఉండాలి.

5.జెండాను నేలమీదగాని, నీటి మీద పడనీయరాదు.

6.జెండాపై ఎలాంటి రాతలు,సంతకాలు, ప్రింటింగులు ఉండరాదు.

7.జెండా ఎప్పుడూ నిటారుగా ఉండాలి.కిందికి వంచకూడదు.

8.జెండాను వడిగా,(వేగంగా) ఎగురవేయాలి.

9.జెండాను ఎగురవేయడం ,మరియు దించడం సూర్యోదయం నుండి సూర్యాస్తమయం లోపున చేయాలి.

10.జెండా మధ్యలోని ధర్మచక్రంలో 24 ఆకులుండాలి.

11.జెండా పాతబడితే తుడుపు గుడ్డగా మాత్రం ఎట్టి పరిస్థితులలో ఉపయోగించరాదు. అది నేరం..దానిని కాల్చివేయాలి.ఎక్కడంటే అక్కడ పడ వేయరాదు.

12.ఒకవేల వివిధ రకాల జెండాల పక్కన ఎగుర వేయవలసి వచ్చినచో జాతీయ జెండా మిగతా వాటికంటే ఎత్తుగా ఉండాలి..

13.జెండాను ఎగుర వేయునపుడు జాతీయనాయకుల ఫోటోలు ఉంచాలి.

14.జెండాను ముందుగా 1,2 సార్లు పరిశీలించుకోవాలి. ఎక్కించి దించడం, మరల ఎక్కించడం చేయరాదు.

15.కావున భారత భావి పౌరులను తీర్చిదిద్ధాల్సిన ఉపాధ్యాయులం మనం. జెండా వందనాన్నీ నియమ నిష్టలతో, నిబద్ధతతో, నియమాలతో చేయాలి.

16.జెండా పోల్ నిటారుగా ఉండాలి.వంకరగా ఉండరాదు.కొన్ని సార్లు విరిగిన సంధర్భాలు జరిగినవి.జాగ్రత్త వహించాలి.

17.విద్యార్థుల జేబులకు ఉంచే చిన్న జెండాలు కింద ఎక్కడంటే అక్కడ పడ వేయనీయరాదు. వాటిని తొక్కనీయరాదు.వాటిని వీలయితే అన్ని ఏరి కాల్చి వేయాలి. పిల్లలకు తప్పని సరిగా జెండా నియమాలు  చెప్పి పాటింప చేయాలి.జాతీయ గేయం పాడునపుడు పాటించే నియమాలు చెప్పాలి.

18.వీలైనంత వరకు పురికోసలకు కట్టే పరారలకు త్రివర్ణ పతాకాలను (చిన్నవి) అతికించరాదు.రంగు రంగుల కాగితాలు మాత్రమే అతికించాలి.రెడీమేడ్ ప్లాస్టిక్ వి త్రివర్ణ పతాకాలు కడుతున్నాం వాటిని కూడా వాడరాదు


 ON THE OCCASSION OF  "INDEPENDENCE DAY" CAN UTYLISE.

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top