జాతీయ ఓపెన్ స్కూల్ సంస్థ (ఎన్ ఐ ఒ ఎస్) కు సంబంధించిన వివిధ కార్యకలాపాలపై ఢిల్లీలో సోమవారం సమీక్షించిన కేంద్ర విద్యా మంత్రి

 జాతీయ ఓపెన్ స్కూల్ సంస్థ (ఎన్ ఐ ఒ ఎస్) కు సంబంధించిన వివిధ కార్యకలాపాలపై ఢిల్లీలో సోమవారం సమీక్షించిన కేంద్ర విద్యా మంత్రి

ఓపెన్ స్కూల్ కు సంబంధించిన వివిధ కార్యకలాపాలపై ఢిల్లీలో సోమవారం సమీక్షించిన కేంద్ర విద్యా మంత్రి శ్రీ రమేష్ పొక్రియాల్ 'నిషాంక్' .  ఈ సమావేశంలో పాఠశాల విద్య మరియు అక్షరాస్యత కార్యదర్శి శ్రీమతి అనితా కార్వాల్,  పాఠశాల విద్య జాయింట్ సెక్రెటరీ శ్రీమతి  స్వీటీ చంగాసన్ మరియు ఓపెన్ స్కూలుకు చెందిన సీనియర్ అధికారులు పాల్గొన్నారు.    


ఉత్తమ ఫలితాలు సాధించడానికి వీలుగా సంస్థ వ్యవహారాలను పారదర్శకంగా నిర్వహించాలని సమావేశంలో మాట్లాడుతూ శ్రీ పొక్రియాల్ ఉద్ఘాటించారు.     పరీక్షల విధానాన్ని బలోపేతం చేయడం గురించి కూడా మంత్రి చర్చించారు.   సంస్థలో ఏవైనా అక్రమాలు జరిగినట్లు మన దృష్టికి వచ్చినట్లయితే నిందితులపై మనం కఠిన చర్యలు తీసుకోవాలి  ఓపెన్ స్కూల్ పరీక్షా కేంద్రాలపై ఏవైనా ఫిర్యాదులు వచ్చినట్లయితే వీలయినంత త్వరగా వాటిని పరిష్కరించాలని ఆయన అధికారులను ఆదేశించారు.  సంస్థ ప్రతిష్టపై ఎవరూ వేలెత్తి చూపకుండా పరీక్షల ప్రక్రియలో సంస్కరణలు తేవాలని కూడా ఆయన అధికారులను ఆదేశించారు.  దేశవ్యాప్తంగా ఓపెన్ స్కూల్ అన్ని కేంద్రాల సమాచారాన్ని మరియు సంప్రదించవలసిన అధికారుల ఫోన్ నెంబర్లతో డ్యాష్ బోర్డు ఏర్పాటు చేయాలనీ కేంద్ర మంత్రి సూచించారు.  దానిలో సంస్థకు సంబంధించిన మొత్తం సమాచారంతో మరియు భాగస్వామ్య పక్షాలకు సూచనలు పొందుపరచడం వల్ల వ్యవస్థలో పారదర్శకత పెరుగుతుందని మంత్రి అన్నారు.  


 


WhatsApp Image 2020-08-24 at 4.35.43 PM.jpeg


జాతీయ ఓపెన్ స్కూల్ సంస్థ ప్రపంచంలోనే అతి పెద్ద ఓపెన్ స్కూల్ వ్యవస్థ అని,  దానిని సమర్ధవంతంగా ఉపయోగించి అట్టడుగు వర్గాల వారికి కూడా విద్యను అందించాలని విద్యామంత్రి అన్నారు.  ఈ స్కూల్ యంత్రాంగాన్ని ఉపయోగించి  దేశంలోని చదువుకోని వారిని  అక్షరాస్యులను చేయాలని అన్నారు.  దీనికి సంబంధించిన సాధ్యాసాధ్యాలను సమీక్షించడానికి ఒక బృందాన్ని ఏర్పాటు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.  


 


      ఓపెన్ స్కూల్ సంస్థ తమ విద్యార్థులకు అందిస్తున్న కోర్సులను కూడా శ్రీ పొక్రియాల్ సమీక్షించారు.  సంస్థ విద్యార్థులకు బహువిధ విషయాలను బోధిస్తున్నట్లు ఆయనకు తెలిపారు.  విద్యార్థులకు విషయాలకు సంబంధించి సరైన అవగాహన కల్పించేందుకు జాతీయ విద్యా పరిశోధనా మండలి సరళిలో ఓపెన్ స్కూల్ సిలబస్ ఉండాలని మంత్రి సూచించారు.  ప్రస్తుతం బోధిస్తున్న కోర్సులను సమీక్షించి విద్యార్థుల ప్రస్తుత అవసరాలకు తగిన విధంగా కొత్త కోర్సులను జోడించాలని విద్యా మంత్రి ఆదేశించారు.  ఓపెన్ స్కూల్ పుస్తకాల ప్రచురణకు వాడిన కాగితాన్ని మళ్ళీ వాడకుండా కొత్త కాగితాన్ని వాడాలని మంత్రి అన్నారు.  


        కోవిడ్ -19 సంక్షోభ సమయంలో  ఓపెన్ స్కూల్ పనిని కూడా మంత్రి సమీక్షించారు.  విద్యార్థుల కోసం నాలుగు చానెళ్లను నిర్వహిస్తున్నట్లు, ప్రతి రోజు విద్యార్థులకు 6 గంటల పాటు  ఆన్ లైన్ లో విద్యా బోధనా చేస్తున్నట్లు,  కోవిడ్ కు ముందు రెండు గంటలు మాత్రమే ఉండేదని అధికారులు మంత్రికి తెలిపారు.  ప్రధానమంత్రి ఈ - విద్యా కార్యక్రమం కింద ఈ తరగతుల వీడియోలను దీక్షా  ప్లాట్ ఫామ్ ద్వారా కూడా  ప్రసారం చేస్తున్నట్లు ఓపెన్ స్కూల్ అధికారులు తెలిపారు.  సమీప భవిష్యత్తులో  సెకండరీ,  హయ్యర్ సెకండరీ స్థాయిలో త్వరలో 6 కొత్త కోర్సులను ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్లు అధికారులు తెలిపారు.  


        భారత సాయుధ దళాలలో పనిచేసే వారి విద్యార్హతలు పెంచడానికి ఓపెన్ స్కూల్ సంస్థ ఆర్మీ విద్యా కోర్ తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.   ఓపెన్ స్కూలులో ఉద్యోగాల ఖాళీల పరిస్థితిని కూడా విద్యామంత్రి సమీక్షించారు.  వీలైనంత త్వరగా ఖాళీలను భర్తీ చేయాలనీ అధికారులను ఆదేశించారు

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top