నేడు విడుదల కానున్న జేఈఈ అడ్వాన్స్‌డ్

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో ప్రవేశానికి నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌–2020 పరీక్ష ప్రాథమిక ‘కీ’ మంగళవారం వెలువడనుంది. 

★ కీ విడుదల చేశాక విద్యార్థుల నుంచి ఈ నెల 30 సాయంత్రం వరకు అభ్యంతరాలను స్వీకరించనుంది.

★ అనంతరం అక్టోబర్‌ 5న తుది ‘కీ’ని, ర్యాంకుల జాబితాను విడుదల చేయనుంది. 

★ జేఈఈ అడ్వాన్స్‌డ్‌ అధికారిక వెబ్‌సైట్‌ నుంచి ప్రశ్నపత్రాన్ని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. 

★ అక్టోబర్‌ 6 నుంచి జాయింట్‌ సీట్‌ అలొకేషన్‌ అ«థారిటీ కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభమవుతుంది. 

★ నవంబర్‌ 9 వరకు మొత్తం 6 విడతల కౌన్సెలింగ్‌ ద్వారా మెరిట్‌ ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది. 

★ అభ్యర్థులు ఒకే రకమైన మార్కులతో సమానంగా ఉంటే నెగెటివ్‌ సమాధానాలివ్వని, ఎక్కువ పాజిటివ్‌ మార్కులున్న అభ్యర్థులకు మెరుగైన ర్యాంక్‌ ఇస్తారు.


★ అందులోనూ సరిసమానంగా అభ్యర్థులుంటే వారిలో గణితంలో ఎక్కువ స్కోరు ఉన్నవారికి అధిక ర్యాంకు కేటాయిస్తారు. 


★ ఆ తర్వాత భౌతికశాస్త్రం మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు. అప్పటికీ సమాన స్థాయిలోఅభ్యర్థులుంటే నిబంధనల మేరకు ర్యాంకులిస్తారు.

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top