ఉపాధ్యాయ బదిలీలు ఆలస్యం - FAPTO నిరవధిక నిరహార దీక్షలు.
ఉపాధ్యాయ బదిలీలు సకాలంలో నిర్వహించకుండా ప్రభుత్వం సాచివేత ధోరణి అవలంభిస్తోన్న విషయం మీకు విదితమే.పలుమార్లు ఫ్యాప్టో ప్రాతినిధ్యాలు చేసినా ఏ మాత్రం కదలిక లేదు. ది 27/09/2020 నా జరిగిన రాష్ట్ర ఫ్యాప్టో కార్యవర్గ సమావేశంలో ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకునే నిమిత్తం ది 08/10/2020 నుండి 17/09/2020 వరకూ 10 రోజుల పాటు జిల్లాల కలెక్టర్కార్యాలయాల ముందు నిరవధిక రిలే నిరహార దీక్షలు నిర్వహించాలని నిర్ణయించడమైనది.
కావునా మీమీ జిల్లాల్లోని మండలాల సంఖ్యను 10 రోజులకు భాగించుకొని ఏఏ మండలాలు ఏఏ తేదీన రిలే దీక్షలో పాల్గోవాలో జిల్లా ఫ్యాప్టోలు ఈ నెల 29, 30 తేదీల్లో సమావేశం జరుపుకొని ఆ మేరకు ఆయా మండలాలకు సమాచారం ఇచ్చి అధిక సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొనే విధంగా ఉద్యమం కార్వల్సిందిగా కోరడమైనది. మీరు జరిపే సమావేశాలకు
తప్పనిసరిగా ఫ్యాప్టో సంఘాల రాష్ట్ర బాధ్యులను ఆహ్వానించాలి. మీ మీ కార్యాచరణను రాష్ట్ర ఫ్యాప్టో కు తెలుపవల్సిందిగా
కోరడమైనది.
0 comments:
Post a Comment