న్యాయశాఖకు చేరిన డియస్సీ 2003 టీచర్ల పాత పెన్షన్ ఫైల్- పిడిఎఫ్

 డియస్సీ 2003 టీచర్లకు . డియస్సీ 2002 హిందీ పండిట్లకు పాత పెన్షన్ వర్తింప చేసే ఫైల్ న్యాయశాఖకు పంపినట్లు విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ బి.రాజశేఖర్ పిడిఎఫ్ యం.ఎల్.సి.లకు తెలియజేశారు. పి.డి.ఎఫ్. యం.ఎల్.సి.లు న్యాయ శాఖ కార్యదర్శి శ్రీమతి వి.సునీత వారిని కలసి త్వరితగతిన పరిష్కరించాలని కోరగా ఫైల్ రాగానే పరిష్కరిస్తామని తెలియజేశారు. 1998 డియస్సీకి సంబంధించి కమిటీ సిఫార్సులు అమలు చేయాలని పిడిఎఫ్ యం.ఎల్.సి.లు కోరగా ఫైల్ ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్నదని తెలియజేశారు.

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Top