మీ PRAN అకౌంట్ లో Nominee Details ను online లో యాడ్/మార్పు చేసుకోవడం ఎలా?

మీ PRAN అకౌంట్   లో  nominee  details ను online లో యాడ్/మార్పు చేసుకోవడం ఎలా?



మీ  pran  ఎకౌంటు నందు నామిని డీటెయిల్స్ లేకపోయినా ,ఉన్న నామిని  డీటెయిల్స్ ను మార్చాలి అనుకున్నా ఈ క్రింది విధంగా ఫాలో అవ్వండి.


👉 Step :-1  మీరు మీ PRAN నెంబర్, పాస్వర్డ్ ఉపయోగించి అకౌంట్ లోకి లాగిన్ అవ్వాలి.


👉  Step :-2  అక్కడ కనిపించిన  demographic changes  ప్రెస్ చేయాలి. మీకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి. వాటిలో లాస్ట్  ఆప్షన్  update personal details  అని వస్తుంది. Update personal details  నీ ప్రెస్ చేయాలి.


👉step :-3 అప్పుడు కొన్ని ఆప్షన్స్ కనబడుతాయి. వాటిలో add/update nominee details ను ప్రెస్ చేయాలి.


అప్పుడు మీకు ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది. దానిలో confirm  నొక్కాలి.


Step :-4 అప్పుడు నామిని డీటెయిల్స్ ఎంటర్ చేసి కన్ఫామ్ చేయాలి.


ఇప్పుడు మన మొబైల్ నెంబర్ కి ఒక ఓటిపి వస్తుంది దాన్ని enter చేయాలి.


👉Step :-5  Next ,e sign verification అనే డైలాగ్ బాక్స్ వస్తుంది. దాన్ని కంటిన్యూ చేస్తే మన ఆధార్ నెంబర్ ఎంటర్ చేసినాక మన మొబైల్ కి రెండోసారి ఓటిపి వస్తుంది. రెండో ఓటిపి ఎంటర్ చేసినాక download   e sign file అని వస్తుంది. దీని కొరకు మన ఎకౌంటు నుండి ఐదు రూపాయల తొంభై పైసలు కట్ అవుతుంది.


Step :-6 దీన్ని డౌన్లోడ్ చేసి మన దగ్గర ఉంచుకోవాలి. అలాగే మీరు ఏ రోజు ఆన్లైన్లో చేశారో ఆ రోజు గుర్తు పెట్టుకోవాలి. 


Sub treasury లో ఉన్న సిపిఎస్ అంశాలు చూసే ఉద్యోగి authorise చేసినాక మీ నామినీ డీటెయిల్స్ ఆన్లైన్ లో మారుతాయి.మీరు వారికి ఏ రోజు నామిని చేంజ్ చేశారో చెప్పాలి ఆ రోజున వారికి టెక్స్ట్ ఫైల్ క్రియేట్ అవుతుంది కాబట్టి వారు ఈజీగా authorise చేసే అవకాశం ఉంటుంది.

Conditions

మీరు ఆన్లైన్లో నామిని డీటెయిల్స్ మార్చుకోవాలంటే రెండు కండిషన్లు apply  అయ్యి ఉండాలి.


1.pran Account లో , Aadhaar లో మీ పేరు ఒకేలా ఉండాలి.


2. Pran Account కి, Aadhaar కి ఒకే phone number ,add అయి ఉండాలి.


మీరు ఈజీగా చేసుకునేందుకు ఈ క్రింద screen shotsను  order లో ఇవ్వడం జరుగుతుంద

PRAN ACCOUNT లో కొత్త గా వచ్చిన OPTION


ABOUT BANK DETAILS IN PRAN ACCOUNT


దీని ప్రకారం మనం మన బ్యాంక్ డీటెయిల్స్ ను అప్డేట్ చేసుకోవచ్చు

Case:-A) మీ ప్రాణ్ అకౌంట్లో బ్యాంక్ డీటెయిల్స్ లేకపోయినా


B) మీరు ట్రాన్స్ఫర్ అయ్యి మీ సాలరీ అకౌంట్ కొత్త బ్యాంకుకి మారినప్పుడు మీ ప్రాణ్ అకౌంట్ లో పాత బ్యాంకు డీటెయిల్స్ ఉంటే


పై రెండు సందర్భాల్లో ఈ క్రింది విధంగా  చేయవలెను.


👉Step :-1 మీరు మీ ప్రాన్ నెంబర్ పాస్వర్డ్ ఉపయోగించి లాగిన్ అవ్వాలి


అక్కడ కనిపించిన demographic changes ను ప్రెస్ చేయాలి మీకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి. 


👉Step:-2 వీటిలో రెండో ఆప్షన్ bank details update ను press చేయండి


ఇప్పుడు bank account number, IFSC code, bank address లను పూర్తి చేయండి.


👉Step :-3 ఇప్పుడు bank passbook , cancelled cheque , bank certificate ల లో   ఒకదాని photo upload చేసి confirm చేయండి.

👉Step:4 e sign verification అని వస్తుంది . దీని కంటిన్యూ చేస్తే మీ ఆధార్ నెంబర్ అడుగుతుంది. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్ కి ఓటిపి వస్తుంది. ఓటిపి ఎంటర్ చేసిన తర్వాత ఫామ్ డౌన్లోడ్ అవుతుంది.

ట్రెజరీ వారు authorise  చేసినాక మీకు బ్యాంక్ డీటెయిల్స్ మారతాయి.

Condition.

మీ ఆధార్ నెంబర్ కి మీ ఫోన్నెంబర్ లింక్ అయి ఉండాలి

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top