మార్చి 1 నుండి ప్రైవేట్ హాస్పిటల్ లోనూ కరోనా వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుంది - కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్

 వచ్చే నెల 1 నుంచి కరోనా వైరస్ వ్యాక్సిన్‌ను 60 ఏళ్ల పైబడిన వారికి కూడా ఇవ్వనున్నట్లు కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ బుధవారం వెల్లడించారు.  


▪️రెండు, అంతకన్నా ఎక్కువ వ్యాధులతో బాధపడుతున్న 45 ఏళ్ల పైబడిన వ్యక్తులకు కూడా ఇస్తామని చెప్పారు. 

▪️దేశవ్యాప్తంగా 10 వేల ప్రభుత్వ, 20 వేల ప్రైవేటు వ్యాక్సినేషన్ సెంటర్లలో వ్యాక్సిన్ వేయనున్నట్లు తెలిపారు. 

▪️ప్రభుత్వ సెంటర్లలో ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తామని స్పష్టం చేశారు. 

▪️ప్రైవేటు ఆసుపత్రులలో వ్యాక్సిన్ వేసుకోవాలని అనుకునే వాళ్లు డబ్బులు చెల్లించాలని జవదేకర్ చెప్పారు. దీనికోసం ఎంత డబ్బు చెల్లించాలో వచ్చే మూడు, నాలుగు రోజుల్లో ఆరోగ్య శాఖ నిర్ణయిస్తుందని ఆయన తెలిపారు.





Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top