వేక్సిన్ వేసుకోవాలా..? పనిచేస్తుందా..? మళ్లీ సోకుతుందా..?

 --వేక్సిన్ వేసుకోవాలా..?

--పనిచేస్తుందా..? 

--మళ్లీ సోకుతుందా..?

--చదవాల్సిన ఇన్ఫో…!


వ్యాక్సిన్ పనిచేస్తదా..? వేసుకోవచ్చా..? ఎనీ గ్యారంటీ…! మొదట వ్యాక్సిన్ అంటే ఏమిటి, ఎలా పనిచేస్తుంది, ఏ విధంగా తయారు చేస్తారు, మనం తీసుకోబోయేది ఏ విధంగా తయారు చేశారు, మన శరీరం నిర్మాణం, మన హెల్త్ ప్రొఫైల్ లాంటి చాలా విషయాల మీద ఇదంతా ఆధారపడి ఉంటుంది.


సాధారణంగా ఏదైనా నిజమైన వైరస్ మన శరీరంలోకి ప్రవేశిస్తే, వ్యాధినిరోధక కణాలు (యాంటీ బాడీస్) ఉత్పత్తి అయ్యి ఆ వైరస్ ని నిర్వీర్యం చేస్తాయి. ఇది సాధారణ జీవక్రియ… ఒకవేళ అలా జరగని పక్షంలో లేదా యాంటీ బాడీస్ తక్కువగా ఉన్న సందర్భంలో మనకి ఆ వైరస్ వలన కలిగే వ్యాధి వస్తుంది,.. అప్పుడు ఆ వ్యాధిని నిరోధించటానికి మన శరీరంలోని శక్తి సరిపోలేదు కాబట్టి యాంటీ వైరల్ డ్రగ్స్ లేదా ఇంకేవో వాడాల్సి వస్తాది… ఏదైనా వ్యాధి వచ్చిందీ అంటే, మనకి యాంటీ బాడీస్ అసలు లేవనీ లేదా తక్కువ ఉన్నాయని కూడా కాదు… ఒకేసారి మన మొఖం మీద గట్టిగా తుమ్మిన ఎవరైనా వ్యక్తికి ఆల్‌రెడీ కరోనా ఉండి ఉందనుకుందాం… ఒకేసారి లక్ష లేదా 4 లక్షల వైరస్ లు ప్రవేశిస్తే మన యాంటీ బాడీస్ సరిపోక కూడా వ్యాధి రావచ్చు… ఆ తర్వాత కొన్ని రోజులకి అదే తగ్గిపోవచ్చు లేదా ట్రీట్ మెంట్ తీసుకోవాల్సి రావొచ్చు…


ఇక వ్యాక్సిన్ విషయానికొస్తే,.. వ్యాక్సిన్ అంటే మందు కాదు… వ్యాక్సిన్ ని 5-8 రకాలుగా తయారు చేస్తారు… నిజమైన వైరస్ ని తీసుకొని, దాన్ని ఫార్మాల్డిహైడ్ లాంటి రసాయనాలతో చంపేసి, ఆ మృత వైరస్ ని శరీరంలోకి ప్రవేశపెడితే, నిజమైన వైరస్ వచ్చింది అనుకొని మన శరీరంలో యాంటీ బాడీస్ ఉత్పత్తి అవుతాయి… కొన్నిసార్లు సింగిల్ వైరస్ ని, మరికొన్నిసార్లు కీడు చేసే జీన్స్ ని తొలగించి, బతికున్న వైరస్ నే వ్యాక్సిన్ గా ఇస్తారు…


ఇంకొన్నిసార్లు హానికరమైన వైరస్ జీన్స్ స్థానంలో బ్యాక్టీరియా జీన్స్ పెట్టి, మిగతాది అంతా వైరస్ జీన్సే ఉంచి, రీ కాంబినెంట్ టెక్నాలజీ ద్వారా చేసిన వైరస్ ని ఎక్కిస్తారు. ఈ విధంగా చాలా రకాలుగా వ్యాక్సిన్ ని తయారు చేస్తారు…


కరోనా వైరస్ కి భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాక్సిన్ అనేది కరోనా వైరస్ ని తీసుకొని, దాన్ని చంపి, చనిపోయిన కరోనా వైరస్ ని ఇంజెక్షన్ రూపంలో ఇస్తున్నారు…


ఆస్ట్రాజెనికా తయారు చేసిన కోవీషీల్డ్ అనేది కరోనా వైరస్ లాగా ఉండే ఎడినో వైరస్ ని తీసుకొని, రీ కాంబినెట్ టెక్నాలజీ ద్వారా చేసిన వ్యాక్సిన్… చనిపోయిన కరోనా వైరస్ ఎక్కించినా, ఎడినో వైరస్ తో చేసిన వ్యాక్సిన్ ఎక్కించినా శరీరంలో యాంటీ బాడీస్ ఉత్పత్తి అవుతాయి. ఈ రెండు మాత్రమే ఇండియాలో ఎక్కువ లభ్యమవుతున్నై కాబట్టి వీటి గురించి ప్రతి ఒక్కరూ పూర్తిగా తెలుసుకోవాలి…


మరి 100% పనిచేస్తాయా..? 

వాళ్ళు చేసిన క్లినికల్ ట్రయిల్స్ ప్రకారం 62% ఎఫెక్టివ్, 90% ఎఫెక్టివ్, 70% ఎఫెక్టివ్ ఇలా ఇచ్చారు… దాని అర్ధం వాళ్ళు క్లినికల్ ట్రయిల్స్ చేసినప్పుడు 100 మందికి ఇస్తే 70 మందిలో మాత్రమే యాంటీబాడీస్ ఉత్పత్తి అయ్యాయి అని అర్ధం… సో ఏదీ 100% వర్క్ అవుట్ కాదు… మనకి పని చేయొచ్చు, చేయకపోవచ్చు…


వ్యాక్సిన్ తీసుకున్నాక కూడా కరోనా వచ్చింది, దీని అర్ధం ఏమిటి..?


ఇక్కడ 2-3 కారణాలు ఉంటాయి..


1)ఆ వ్యాక్సిన్ మనకి ఎఫెక్టివ్ కాదు...


2)వ్యాక్సిన్ సమర్ధవంతమైనదే కాని మనలో కొన్ని కారణాల వలన యాంటీబాడీస్ కాంప్రమైజ్ అయ్యి ఉత్పత్తి అవ్వలేదు.


3)యాంటీ బాడీస్ ఉత్పత్తి అయ్యాయి కాని కొన్ని రోజులే ఉన్నాయి, అ తర్వాత ఎవరినుంచో కరోనా వచ్చింది.ఈ విధంగా చాలా కారణాలు  ఉంటాయి… 


మళ్ళీ వైరస్ విషయానికొస్తే….

మరి ఏ వ్యాక్సిన్ వేసుకోవాలి..?

భారత్ బయోటెక్ వాళ్లేమో చనిపోయిన వైరస్ ని ఎక్కిస్తున్నారు. ఆస్ట్రాజెనికా కోవీషీల్డ్ ఎడినో వైరస్ నుంచి తయారు చేసినది… ఏ ఇతర జబ్బులు ఉన్నా 97% భారత్ బయోటెక్ కొవాక్సిన్ వేసుకోవచ్చు… కారణం, ఆ ఇంజెక్షన్ వేసాక పెద్దగా రియాక్షన్స్ ఏమీ జరగవు… ఒక చనిపోయిన వైరస్ ని చూసి నిజమైన వైరస్ అనుకొని యాంటీబాడీస్ ఉత్పత్తి అవుతాయి… ఎక్కువ సంఖ్యలో యాంటీబాడీస్ ఉత్పత్తి అయితే అత్యంత పెద్ద జబ్బులు ఉన్నవారికి ఏమైనా అవుతుందా అనేది సరైన నిపుణులని అడిగి తెలుసుకోవాలి. కాని సాధారణంగా అందరూ తీసుకోవచ్చు… పైజర్ ఇంకేదో m- RNA వ్యాక్సిన్ ల విషయానికొస్తే, వ్యాక్సిన్ తీసుకున్నాక శరీరంలో కొన్ని రియాక్షన్స్ జరుగుతాయి, అది సెపరేట్ ఇక్కడ అప్రస్తుతం… అయితే కొవాక్సిన్ తీసుకున్నా, కోవీషీల్డ్ తీసుకున్నా అవి సమర్ధవంతంగా మనకి పనిచేస్తాయా లేవా అనే గ్యారంటీ అయితే లేదు... వ్యాక్సిన్ సమర్ధవంతంగా ఉండి, యాంటీ బాడీస్ ఉత్పత్తయినా, అవి ఎల్లకాలం ఉండే అవకాశం అందరికీ ఉండదు…


వేక్సిన్ వేసుకున్నా సరే, కొత్తగా కరోనా సంక్రమించబోదు అనేది అబద్ధం…


వేక్సిన్ వేసుకున్నా సరే, ఏదో కారణంతో కరోనా వైరస్ మన దేహంలోకి ప్రవేశించవచ్చు… అప్పుడు టెస్టులు చేస్తే పాజిటివే వస్తుంది… కానీ ఆ వైరస్‌ను చంపేయగల యాంటీ బాడీస్ మన దేహంలో ఉత్పత్తవుతాయి కాబట్టి ఆ వైరస్ మనల్ని ఏమీ చేయలేదు… ఇదీ క్లారిటీ…


మరి ఇంకేదో వైరస్ కి వ్యాక్సిన్ తీసుకుంటే, దానికి సంబంధించిన వ్యాధి ఎన్ని సంవత్సరాలు అయినా రాలేదు, అది 100% పనిచేసింది కదా, మరి కరోనా వైరస్ కి ఎందుకు అలా జరగదు అంటే… వేరే వైరస్ కి మనం వ్యాక్సిన్ తీసుకున్నాం, ఆ రోజుల్లో యాంటీ బాడీస్ ఉత్పత్తి అయ్యాయి, దానికి సంబంధించిన యాంటీ బాడీస్ మన శరీరంలో లేకపోయినా ఇప్పుడు ఆ వైరస్ బయట లేదు..; కానీ ఇప్పుడు కరోనా వైరస్ ప్రతి జిల్లాలో ఉంది, కాబట్టి ఇది డిఫరంట్… మరీ అతి పెద్ద వ్యాధులు, ఇతర అనారోగ్య కండీషన్స్ ఉన్న వాళ్ళు మినహా అందరూ తీసుకుంటే ఆ వైరస్ ని పూర్తిగా పారద్రోలవచ్చు… ఆ తర్వాత యాంటీ బాడీస్ ఉత్పత్తి కాకపోయినా, ఉత్పత్తి అయిన యాంటీ బాడీస్ నిర్వీర్యం అయినా ఏమీ కాదు…


కరోనా వైరస్ ప్రపంచం నుంచి వెళ్ళిపోయేవరకు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మనదేశంలో పూర్తిగా పోయినా, ఎక్కడో ఒక దేశంలో ఉంటే, ఎవరో ఒకరి ద్వారా మళ్ళీ వ్యాపిస్తుంది; అందుకే ఇంకో సంవత్సరం వరకు అందరూ కొంచెం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది…


వ్యాక్సిన్ పూర్తి పరిష్కారం కాదు… కానీ చాలా ఉపయోగం ఉంది… వీలైనంత ఎక్కువ మంది వ్యాక్సిన్ తీసుకోవాలి, అందరూ జాగ్రత్తలు పాటించాలి…!

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top