అందుకే సెకండ్ వేవ్ వచ్చింది :కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్ష వర్ధన్



 నిర్లక్ష్యం కారణంగానే దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ తెలిపారు. సెకండ్ వేవ్ కూడా అందుకే ఇంత ఉధృతంగా సాగుతోందని అన్నారు. ''నేనెప్పుడూ మాస్క్ తీయలేదు. మా ఇంట్లో కూడా మాస్క్ తీయను. ధరించే ఉంటాను. అందరూ మాస్క్ ధరంచాలి. ఈ నియమాన్ని ఎవరూ ఉల్లంఘించవద్దు'' అని హర్షవర్ధన్ పిలుపునిచ్చారు. ఓ జాతీయ ఛానల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పై వ్యాఖ్యలు చేశారు. కరోనా మార్గదర్శకాలను అందరూ పాటించాలని, ఎవరూ ఉల్లంఘించవద్దన్నారు. ఒక్కరు తప్పు చేస్తే అందరూ శిక్ష అనుభవిస్తారని, అందుకే అందరూ నియమాలను పాటించాలని కోరారు. అందరూ మాస్క్ ధరించి, రెండు అడుగుల భౌతిక దూరాన్ని పాటించాలని పిలుపునిచ్చారు.

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Top