దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ కల్లోలం సృష్టిస్తోంది. ఇప్పటికే రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య 2లక్షలు దాటింది. ఇటు ఆంధ్రప్రదేశ్ లోనూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. చూస్తుండగానే రోజువారి పాజిటివ్ కేసుల సంఖ్య 4వేలు దాటుతోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యంగా కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతున్న జిల్లాల్లో హై అలర్ట్ ప్రకటించింది. కరోనా కేసులు ఎక్కువగా ఉన్న కృష్ణ జిల్లా, గుంటూరు, విశాఖపట్నం, నెల్లూరు, తూర్పుగోదావరి, చిత్తూరు జిల్లాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. అన్ని జిల్లాల వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన..న్ని జాగ్రత్తలు తీసుకోవాలని అదేశాలిచ్చారు.
కరోనా నివారణకు సీఎం ప్రత్యేక చర్యలు చేపట్టారన్నారు. రానున్న ఆరు వారాల్లో కరోనా కేసులు భారీగా పెరిగే అవకాశం... ప్రజలు మరింతగా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలు అత్యవసరమైతేనే బయటకు రావాలని.. తప్పనిసరిగా భౌతిక దూరం పాటిస్తూ, మాస్క్ ధరించాలని స్పష్టం చేశారు. గతంలో పోలిస్తే వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్నందున నిర్లక్ష్యానికి తావులేకుండా ఉండాలన్నారు.కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఆరోగ్య శాఖ సిద్ధమైందని.. అన్ని కొవిడ్ ఆస్పత్రుల్లో అదనపు బెడ్లు ఏర్పాటు చేశామన్నారు.
0 comments:
Post a Comment