నెలకు వెయ్యి రూపాయలు పెట్టుబడి పెట్టండి 26 లక్షల పొందండి

 PPF Scheme: డబ్బు సంపాదించాలని అందరికీ ఉంటుంది... కానీ కొందరే సంపాదిస్తారు. ఎందుకంటే... డబ్బు రావాలంటే... క్రమశిక్షణ, ఓర్పు కీలకం. ఉన్న కాస్త డబ్బును సరైన స్కీములో పెట్టుబడి పెడితే... క్రమశిక్షణతో... ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే... కచ్చితంగా మంచి రిటర్నులు వస్తాయి. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) పెట్టుబడి ఆప్షన్ ఇలాంటిదే. మీరు దీర్ఘ కాలం పెట్టుబడి పెట్టేందుకు సిద్ధపడితే... ఇది మీకు సరైన ఆప్షన్ అవుతుంది. ఎందుకంటే... కాలం గడిచేకొద్దీ ఇందులో మీకు వచ్చే రిటర్నులు భారీగా పెరుగుతాయి. 1968లో నేషనల్ సేవింగ్స్ ఆర్గనైజేషన్.. అన్ని స్మాల్ సేవింగ్స్‌నీ... లాభదాయక పెట్టుబడి ఆప్షన్‌గా మార్చమని ఆదేశించింది. అందువల్ల PPF అనేది సరైన పెట్టుబడి రిటర్న్ అవుతోందిఉదాహరణకు మీరు ప్రతి నెలా రూ.1000 పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌లో పెట్టుబడి పెడితే... దీర్ఘ కాలంలో ఇది మీకు భారీ రిటర్న్ ఇస్తుంది. దాదాపు రూ.26 లక్షలు పొందవచ్చు. అదెలాగో ఓ అంచనా రూపంలో తెలుసుకుందాం.

ప్రస్తుతం పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్... 7.1 శాతం వడ్డీ ఇస్తోంది. ఏడాదికి కనీసం రూ.500 నుంచి లక్షన్నర దాకా పెట్టుబడి పెట్టవచ్చు. ఈ PPF అకౌంట్ 15 సంవత్సరాల్లో మెచూర్ అవుతుంది. ఆ తర్వాత మీరు మీ డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. లేదా మరో ఐదేళ్లకు పెంచుకోవచ్చు.

ఒక వ్యక్తి నెలకు రూ.1000 చొప్పును 15 ఏళ్లు పెట్టుబడి పెడితే... మొత్తం డిపాజిట్ చేసినది రూ.1.80 లక్షలు అవుతుంది. తద్వారా 15 ఏళ్ల తర్వాత రూ.3.25 లక్షలు రిటర్న్ పొందగలరు. ఎందుకంటే 7.1 శాతం చొప్పున వడ్డీ మొత్తం రూ.1.45 లక్షలు అవుతుంది.

మరో ఐదేళ్లకు పెంచుకోవచ్చు:

ఇప్పుడు ఆ డబ్బు తీసుకోకుండా.. మరో ఐదేళ్లకు పెంచుకుంటే... నెలకు రూ.1000 చొప్పున పెట్టుబడి పెడుతూనే ఉంటే... 5 ఏళ్ల తర్వాత... రూ.3.25 లక్షలు కాస్తా రూ.5.32 లక్షలు అవుతుంది.

2వ సారి మరో ఐదేళ్లకు పెంచుకోవచ్చు:

ఐదేళ్ల తర్వాత మరో ఐదేళ్లకు అకౌంట్‌ను పెంచుకుంటే... అప్పుడు PPF అకౌంట్ అమౌంట్... రూ.8.24 లక్షలు అవుతుంది.

3వ సారి మరో ఐదేళ్లకు పెంచుకోవచ్చు:

మూడోసారి కూడా PPF అకౌంట్‌ను మరో ఐదేళ్లకు పెంచుకుంటే... మొత్తం 30 ఏళ్లలో వచ్చే రిటర్న్ రూ.12.36 లక్షలు అవుతుంది.

4వ సారి మరో ఐదేళ్లకు పెంచుకోవచ్చు.

మరో ఐదేళ్లకు పెంచుకుంటే... 35 ఏళ్లలో వచ్చే రిటర్న్ రూ.18.15 లక్షలు అవుతుంది.

5వ సారి మరో ఐదేళ్లకు పెంచుకోవచ్చు.

మరో ఐదేళ్లకు పెంచుకుంటే... 40 ఏళ్ల పాటూ... నెలకు రూ.1000 చొప్పున ఇన్వెస్ట్ చేస్తూ పోతే... మొత్తం పెట్టుబడి రూ.4,80,000... దానికి 7.1 శాతం వడ్డీ కలిపి మొత్తం వచ్చేది రూ.26.32 లక్షలు.

20 ఏళ్ల వయసప్పుడే ఈ విధానంలో ఇన్వెస్ట్ చేస్తూ పోతే... 60 ఏళ్లు వచ్చేసరికి... రూ.26.32 లక్షలు పొందవచ్చు. అదే... నెలకు రూ.2000 చొప్పున ఇన్వెస్ట్ చేస్తూ పోతే... 60 ఏళ్లు వచ్చేసరికి 52.64 లక్షలు పొందవచ్చు. ఇలా ఓ దీర్ఘకాలిక ప్లాన్ వేసుకుంటే... రిటైర్మెంట్ తర్వాత నిశ్చింతగా ఉండొచ్చు.

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top