Carona Krishna Patnam Medicine:ఆనందయ్య కరోనా కు ఉపయోగించే మందులో 16 రకాల వస్తువులు

ఆనందయ్య కరోనా కు ఉపయోగించే మందులో 16 రకాల వస్తువులు వినియోగిస్తున్నట్లు చెబుతున్నారు. వాటిలో ఒక్కో వస్తువు ఏ వ్యాధికి ఉపయోగపడుతుందో తెలుసుకుందాం. కృష్ణపట్నం కరోనా ముందు రోగికి సమర్థవంతంగా పని చేస్తుందో లేదో పరిశోధనలు జరుగుతున్నాయి. ప్రభుత్వం త్వరలో దీనిమీద నిర్ణయం తీసుకోనుంది


Note: కృష్ణపట్నం ముందు మీద ప్రభుత్వం, ఆయుర్వేదం వారు మరియు ICMR వారు పరిశోధన చేస్తున్నారు పరిశోధన ఫలితాలు అనంతరం ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది.

1. అల్లం : అల్లం శ్వాసకోస వ్యాధులను నయం చేస్తుంది.

2.తాటి బెల్లం : ఆయుర్వేదంలో ఘాటయిన మొక్కలను ఔషధంగా ఉపయోగించిన్నప్పుడు దానిని తాటి బెల్లం తో తీసుకుంటారు..

3.తేనె : తేనె కఫాన్ని తగ్గిస్తుంది. ఔషధాలు నేరుగా శరీరంలో కలవడానికి చాలా రకాల ఔషధాలలో తేనెను కలుపుతారు.

4.నల్ల జీలకర్ర : నల్ల జీల కర్ర లో చాలా పోషకాలు ఉన్నాయి. ఇందులో కాల్షియం మెగ్నీషియం పొటాషియం ఫాస్ఫరస్ జింక్ మాంగనీస్ కాపర్ ఐరన్ వంటి పోషకాలు ఉన్నాయి. ఇందులో థైమోక్వీనోన్ ఉంది. ఇది బయోయాక్టివ్ కంపోనెంట్ గా పనిచేస్తోంది. అంతేకాకుండా హానికర సూక్ష్మజీవులను, బ్యాక్టీరియాను శరీరం నుండి బయటకు పంపిస్తుంది. ఇందులో యాంటీ మైక్రోబయాల్ ఉండడం వలన కడుపులో ఏర్పడే పురుగులను తొలగిస్తుంది. ఇంకా కడుపునొప్పి విరోచనాలు, గ్యాస్ట్రిక్, అధిక కొవ్వు, ఇన్సులిన్ సమస్యలను తొలగిస్తుంది.

5. తోక మిరియాలు : జలుబు, దగ్గు , కండరాల నొప్పి, స్వరపేటిక సమస్యలను నివారిస్తుంది.

6.లవంగాలు : ఇందులో ఉన్న యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు జలుబు, దగ్గును నివారిస్తుంది. దీనిలో యుజెనల్ అనే పదార్థానికి శక్తివంతమైన యాంటీ ఇన్ఫామెంటరీ గుణాలు శరీరంలోని సైటోకైన్లను తగ్గిస్తుంది. ఇంకా తలనొప్పి, మోకాళ్ల నొప్పులను కూడా నివారిస్తుంది.

7. వేప: వేప సహజ కీటకనాశిని. శరీరంలో ఉన్న బ్యాక్టీరియాలను నశింపజేస్తుంది. దగ్గు, కఫం, ఆస్తమా, శ్వాసకోశ, అతిసారం గ్యాస్, అల్సర్ సమస్యలను తగ్గిస్తుంది. తెల్ల రక్త కణాలను వృద్ధి చేస్తుంది.

8.నేరేడు : కాలేయాన్ని శుభ్ర పరచడానికి దివ్యౌషధంగా పనిచేస్తుంది.

9. మామిడి : జ్వరాన్ని తగ్గించడానికి, కడుపులో పురుగులను తొలగించడానికి, కాలేయ సమస్యలను నివారించడానికి ఈ చెట్టు బెరడును ఉపయోగిస్తారు.

10. నేలఉసిరి : వైరల్ జ్వరాలకు ఇది చెక్ పెడుతుంది.

11.కొండపల్లేరు : ఆయాసం, ఉబ్బసం, క్షయవ్యాధి దగ్గు ను నివారిస్తుంది.

12.కుప్పింటాకు : దగ్గు, జలుబు , గొంతు నొప్పి, కీళ్ల నొప్పులు, కడుపులో నులిపురుగులను నివారిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

13.తెల్ల జిల్లేడు పువ్వు: ఆస్తమాను నివారిస్తుంది. అంతేకాకుండా పాముకాటుకు విరుగుడుగా పనిచేస్తుంది.

14.పట్టా : ఇందులో యాంటీ వైరల్, యాంటీ సప్లమెంటరీ గుణాలు ఉన్నాయి.

15.బుడ్డ బుడస ఆకు : ఈ ఆకులో ఔషధ గుణాలు శరీరంలోని సూక్ష్మజీవులను నశింపజేస్తుంది.

16.ముళ్ల వంకాయ : ఇందులో నొప్పులను కూడా ఔషధ గుణాలు ఉన్నాయి.

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top