పల్స్‌రేటు, ఆక్సిజన్‌ను సూచించే 'కేర్‌ప్లిక్స్‌ విటల్స్‌’ మొబైల్‌ యాప్‌

 పల్స్‌రేటు, ఆక్సిజన్‌ను సూచించే 'కేర్‌ప్లిక్స్‌ విటల్స్‌’ మొబైల్‌ యాప్‌



అభివృద్ధి చేసిన కోల్‌కతా స్టార్టప్‌


హైదరాబాద్‌, (మస్తే తెలంగాణ): కరోనా సంక్షోభ సమయంలో ప్రతీ ఇంట్లో ఆక్సీమీటర్‌ పెట్టుకోవాల్సిన పరిస్థితి. డిమాండ్‌ కారణంగా కంపెనీలు రూ. 2వేల వరకు పెంచాయి. ఈ ఇబ్బందులను తొలగిస్తూ ఫోన్‌లోనే పల్స్‌ రేటు, ఆక్సిజన్‌ స్థాయిలను తెలిపేలా కోల్‌కతాకు చెందిన కేర్‌ నౌ హెల్త్‌కేర్‌ స్టార్టప్‌ 'కేర్‌ప్లిక్స్‌ విటల్స్‌’ పేరుతో మొబైల్‌ యాప్‌ను అభివృద్ధి చేసింది.

డౌన్‌లోడ్‌ ఎలా?

ఈయాప్‌ను https:// apkoll.com/apk/ careplex-vitals-apk/ ల లింక్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోగానే ఇన్‌స్టాల్‌ చేసుకొని రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను పూర్తి చేయాలి. మొబైల్‌ నంబర్‌కు ఓటీపీ వస్తుంది.అది ఎంటర్‌ చేస్తే యాప్‌ పనిచేస్తుంది. స్మార్ట్‌ఫోన్‌ వెనుక కెమెరా, ఫ్లాష్‌లైట్‌ వద్ద చేతి వేలిని 40 సెకన్లు పెడితే ఆక్సిజన్‌, పల్స్‌ రేటు మొబైల్‌లో కనిపిస్తాయి.

98% కచ్చితత్వం

ఈ యాప్‌ను ఈ ఏడాది ప్రారంభంలో కోల్‌కతాలోని సేత్‌ సుఖ్‌లాల్‌ కర్నానీ దవాఖానలో పరీక్షించారు. దాదాపు 1200 మంది ఆక్సిజన్‌, పల్స్‌ రేటును పరిశీలించారు. ఆక్సిజన్‌ సాచురేషన్‌ను పసిగట్టడంలో కేర్‌ప్లిక్స్‌ 98% కచ్చితత్వంతో పనిచేసినట్టు సుబ్రతా పౌల్‌ తెలిపారు.

Download Android App

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Top