Scheme for compassionate appointment కారుణ్య నియామకాలు: మరణించిన ప్రభుత్వోద్యోగి యొక్క ఆధారితులకు జిఓ 687 జిఏడి, తేది. 03.10.1977 ద్వారా కారుణ్య నియామకం | 60681/సర్వీస్-ఎ/2003-1 జిపిడి తేది. 12,08, 2003 ద్వారా సమగ్ర ఉత్తర్వులు యివ్వబడినవి. "వైద్య కారణములపై రిటైరైన ఉద్యోగుల వారసులకు కారుణ్య నియామకాలు జి.ఓ.ఎంఎస్.సం. 661 జివిడి తేది.| 23.10.2008 ద్వారా పునరుద్ధరించబడింది.
Compassionate Appointment to Dependents of Govt Employees:
who is eligible for compassionate appointment కారుణ్య నియామకాలకు అర్హులైన వారు :
Join Our Free Social Media Educational Free Alerts Groups:
Join Our Telegram Andhra Teachers Channel Click Here
Join Our Whatsapp Andhra Teachers Channel Click Here
1) మరణించిన లేక
2) గడిచిన 7సం॥ల పైగా కనిపించకుండా పోయిన లేక
3) వైద్య కారణములపై రిటైర్మెంటు మెడికల్ బోర్డు ఉద్యోగి వినతిని అప్రస్ చేసిన తేదీ నుండి (జిఓ నం. 182, తేది. 22.05.2014)| 5 సం॥ల సర్వీసుగల ఉద్యోగి కుటుంబములో సంపాడనా పరులెవ్వరు లేనప్పుడు ఆ కుటుంబములో ఒకరు నియామకమునకు అర్హులు. ఉద్యోగి కనిపించకుండా పోయిన సందర్భంలో పోలీసు, రిపోర్టు ఆధారంగా, సంబంధిత ప్రభుత్వ శాఖ కార్యదర్శిఅనుమతితో కారుణ్య నియామకం ఇవ్వబడుతుంది.
సర్వీస్లో మరణించిన ఎయిడెడ్ టీచర్ల వారసులకు జిల్లా యూనిట్గా కారుణ్య నియామకాలు జిఓ.ఎంఎస్.నం. 113 విద్య తేది. 06.10.2009 ద్వారా అనుమతించబడినవి.
ఆధారిత కుటుంబ సభ్యులు :
1) ఉద్యోగి భార్యలేక భర్త
2) కుమారుడు లేక కుమార్తె
3) ఉద్యోగి మరణించిన నాటికి 5సం॥ల ముందు చట్టబద్ధంగా దత్తత తీసుకొనబడిన కుమారుడు లేక కుమార్తె
4) ఉద్యోగి భార్య / భర్త నియామకమునకు ఇష్టపడని సందర్భములో ఆ కుటుంబముపై ఆధారితురాలైన వివాహిత కుమార్తె
5) మరణించిన ఉద్యోగికి - ఒక వివాహిత కుమార్తె, మరియొక మైనర్ కుమార్తె వున్న సందర్భములో వారి తల్లిచే సూచించబడిన ఒకరు
6) ఉద్యోగి అవివాహితుడై మరణించినప్పుడు అతని తమ్ముడు లేక చెల్లెలు కారుణ్య నియామకమునకు అర్హులు. కారుణ్య నియామకము పొందిన తదుపరి పునర్వివాహం చేసుకొన్నను ఉద్యోగంలో కొనసాగుతారు. నియమించబడే పోస్టు స్థాయి: జూనియర్ అసిస్టెంట్ పోస్టునకుగాని, ఆ పోస్టు యొక్క స్కేలుకు మించని పోస్టుకుగాని, అంతకంటే తక్కువ స్థాయి పోస్టుకుగాని కారుణ్య నియామకము ఇవ్వబడును.
Compassionate appointment rules in state government నియామకపు విధానము :
వైద్య కారణములపై రిటైర్మెంట్ కోరుకొనే వారి దరఖాస్తు జిల్లా / రాష్ట్ర వైద్యుల కమిటీకి పంపి వారి నివేదిక ఆధారంగా జిల్లా / రాష్ట్ర కమిటీ సిఫార్సు మేరకు నియామకాధికారి అనుమతిస్తారు.
అర్హతలు : ఆయా పోస్టులకు సంబంధించిన నిర్ణీత విద్యార్హతలను కలిగి వుండాలి. అయితే జూనియర్ అసిస్టెంట్గా సబార్డినెట్ ఆఫీసులలో నియామక అర్హతైన ఇంటర్మీడియేట్ పాసగుటకు 3 సం॥ల గదువు, శాఖాధిపతి కార్యాలయము లేక సచివాలయము అయినచో నియామక అర్హతైన డిగ్రీ పాసగుటకు 5 సం॥ల గడువు అనుమతించబడుతుంది. గడువులోగా కావలసిన అర్హత వర్తిస్తుంది. అయితే ఎస్సి, ఎస్టి, బిసి తరగతులకు చెందినవారికి 5 సం||ల మినహాయింపు వున్నది. ఉద్యోగి భార్య / భర్తకు కారుణ్య నియామకము ఇవ్వవలసిన సందర్భములో గరిష్ట వయోపరిమితి 45 సం॥ల. 3) చివరి | శ్రేణి పోస్టులకు వయస్సు, అర్హతలు తగిన విధంగా లేనప్పుడు ముందు నియామకమును యిచ్చి ఆ తదుపరి మినహాయింపును సంబంధిత శాఖ నుండి పొందవచ్చును.
నియామక పరిధి :
మరణించిన ఉద్యోగి పనిచేసిన యూనిట్లో నియామకము ఇవ్వబడుతుంది. ఆ యూనిట్లో ఖాళీ లేనప్పుడు ఆ కేసులను నోడల్ అధికారియైన జిల్లా కలెక్టరుకు పంపినచో వారు ఇతర ఏ డిపార్టుమెంట్లకైనను కేటాయించెదరు. ఏ డిపార్టుమెంటులోను, ఖాళీలు లేని సందర్భములో కలెక్టరు ఒక క్యాలెండరు సంవత్సరంలో 5 వరకు సూపర్ న్యూమరరీ పోస్టులను సృష్టించవచ్చును. అంతకుమించి పోస్టులు అవసరమయినప్పుడు సంబంధిత శాఖకు ప్రతిపాదనలు పంపబడతాయి. ఈ కారుణ్య నియమకాలు డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటాలో సిక్స్ పాయింట్ ఫార్ములాకు లోబడి యివ్వబడతాయి. అట్లే రిజర్వేషన్ నిబంధన (రూలు 22)ను పాటించవలసి వుంటుంది. మరణించిన ఉద్యోగి భార్య కారుణ్య నియామమునకు దరఖాస్తు చేస్తే ఆమె స్వంత జిల్లాలోగాని, భర్త ఉద్యోగము చేసిన చోటగాని, ఏ ఇతర జిల్లాలో గాని నియామకాన్ని కోరుకోవచ్చు.
ఎక్స్ గ్రేషియా చెల్లింపు:
కారుణ్య నియామకమయి ఇచ్చుట సాధ్యపడని సందర్భంలో నాలుగవ తరగతి ఉద్యోగుల కుటుంబములకు రూ.5,00,000/- నాన్- గజిటెడ్ వారికి రూ.8,00,000/- గజిటెడ్ వారికి రూ.10,00,000/ ఎక్స్ గ్రేషియా చెల్లించబడుతుంది. (జిఓ ఎంఎన్ నం.114 జిఎడి తేది. 21.08.2017)
Compassionate Appointment – Ex-gratia in lieu of compassionate appointments to the dependents of deceased Govt. employees – Enhancement of existing ex-gratia – Orders – Issued
GO.No:114 Dt:21-08-2017 Click Here to Download
Compassionate Appointments Application
Compassionate Appointment Complete GOs
0 comments:
Post a Comment