మహాత్మ జ్యోతిబా ఫూలే ఆంధ్ర ప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయముల సంస్థ 2021-22 విద్యా సంవత్సరమునకు 5 వ తరగతి ప్రవేశ ప్రకటన

మహాత్మ జ్యోతిబా ఫూలే ఆంధ్ర ప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయముల సంస్థ 2021-22 విద్యా సంవత్సరమునకు 5 వ తరగతి ప్రవేశ ప్రకటన

మహాత్మ జ్యోతిబా ఫూలే ఆంధ్ర ప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయముల సంస్థచే నడుపబడుచున్న 92 పాఠశాలల్లో 2021-22 విద్యా సంవత్సరానికి గానూ 5 వ తరగతి (ఇంగ్లీష్ మీడియం)లో

విద్యార్థులను లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక చేయబడును


ప్రవేశానికి అర్హత :

1. వయస్సు : బి .సి . మరియు ఈ .బి.సి . (BC /EBC) లకు చెందిన వారు 01-09-2010 నుండి 31-08-2012 మధ్య పుట్టి వుండాలి.యస్.సి. మరియు యస్.టి. (ఎస్.సి/ఎస్ టి) లకు చెందిన వారు 01-09-2008 నుండి 31-08-2012 మధ్య పుట్టి వుండాలి. 

2. సంబందిత జిల్లాలో 2019-20 & 2020-21 విద్యాసంవత్సరములలో నిరవదికముగా ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 3 మరియు 4 తరగతులు చదివివుండాలి. 

3. ఆదాయ పరిమితి అభ్యర్థి యొక్క తల్లి , తండ్రి/సంరక్షకుల సంవత్సర ఆదాయము 2020-21 ఆర్థిక సంవత్సరమునకు రూ.1,00,000/-లు మించి ఉండరాదు. 

4. దరఖాస్తు చేయు వెబ్ సైట్

http://www.mjpapbcwr.in 


 5. దరఖాస్తు చేయు

విధానం : అభ్యర్థులు పై అర్హతలు పరిశీలించుకొని సంతృప్తి చెందిన తరువాత ఆన్ లైన్ లో తేదీ 14-06-2021 నుండి తేదీ 30-06-2021 లోగా దరఖాస్తు చేసుకోవాలి.

 ✳️దరఖాస్తు చేయు విధానములో సందేహమున్నచో పాఠశాల కార్యాలయాలలో పని వేళలు ఉదయం 10.00 గం.ల నుండి సాయంత్రం 4.30 గం.ల లోపు  సంప్రదించవచ్చు

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top