జగనన్న విద్య కానుక కిట్ల లో ఈ ఏడాది అదనంగా డిక్షనరీ

 జగనన్న విద్య కానుక కిట్లు అందుకున్న తర్వాత ఉపాధ్యాయులు పరిశీలించాల్సిన అంశాలు:

*వైట్‌, రూల్డ్‌, బ్రాడ్‌ రూల్డ్, గ్రాఫ్‌.. అన్ని రకాల నోటు పుస్తకాలను పరిశీలించాలి

* అన్ని రకాల బ్యాగులు, బెల్టులు, బూట్లు, సాక్సులు, యూనిఫాం క్లాత్‌ను పరిశీలించాలి

* ప్రతి మండల రిసోర్సు కేంద్రం/ స్కూల్‌ కాంప్లెక్సుకు మెటీరియల్‌ తగినంత అందిందో లేదో సరిచూసుకోవాలి

* ప్రతి స్కూల్‌ కాంప్లెక్సుకు అందజేసే మెటిరీయల్‌లో ప్రతి రకానికి సంబంధించి కనీసం ఒక కార్టన్‌ / సంచి / ప్యాకెట్‌ను పూర్తిగా పరిశీలించాలి

* యూనిఫాం క్లాత్‌ మండల రిసోర్సు కేంద్రానికి ప్యాకెట్లతో కూడిన బేల్‌ రూపంలో చేరుతుంది.

* స్కూల్‌ కాంప్లెక్స్‌కు అందజేసిన వస్తువుల్లో పాడైనవి, చిరుగులు గుర్తిస్తే మండల విద్యాధికారి దృష్టికి తేవాలి. మండల రిసోర్సు కేంద్రాల్లో వీటిని గుర్తిస్తే జిల్లా విద్యాశాఖాధికారి/ సమగ్ర శిక్షా జిల్లా అదనపు ప్రాజెక్టు కో ఆర్డినేటర్‌కి సమాచారం అందించాలి

* వస్తువులన్నీ సెట్లుగా చేసి బ్యాగులో సర్ది కిట్లుగా ఉంచాలి

* మండల రిసోర్సు కేంద్రం నుంచి కిట్ల రూపంలో పాఠశాలలకు చేర్చాలి

* ప్రభుత్వం నిర్దేశించిన సమయంలో విద్యార్థులకు వెంటనే అందించాలి

* నోటు పుస్తకాలకు సంబంధించి సప్లయిర్స్‌ నుంచి స్కూల్‌ కాంప్లెక్సులకు నేరుగా సరుకు అందుతుంది

* తగినంత సరుకు రాని పక్షంలో స్కూల్‌ కాంప్లెక్స్‌ ప్రధానోపాధ్యాయులు మండల విద్యాశాఖాధికారులకు తెలియజేయాలి

* వివరాలను జగనన్న విద్యాకానుక ' యాప్‌లో నమోదు చేయాలి

* యూనిఫాంకి సంబంధించి మండల రిసోర్సు కేంద్రానికి తగినంత సరుకు వచ్చిందా లేదా సరిచూసుకోవాలి. ఒక్కో ప్యాకెట్లో 3 జతలకు సరిపడే యూనిఫాం క్లాత్‌ ఉంటుంది

* ప్రతి తరగతికి క్లాత్‌ కొలతలు సరిగా సరిపోయాయా లేదా అనేది యూనిఫాం బేల్‌లో ఒక ప్యాకెట్‌ తీసుకుని చెక్‌ చేయాలి

* యూనిఫాం క్లాత్‌ రంగు ఇచ్చిన నమూనాతో సరిచూసుకోవాలి

* క్లాత్‌ నాణ్యత బాగాలేకపోయినా, రంగు మారినా, చిరుగులు ఉన్నా రిజక్ట్‌ చేసి వెనక్కి పంపవచ్చు. ఈ సమాచారాన్ని సంబంధిత మండల విద్యాశాఖాధికారి / సీఎంవో సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి, సమగ్ర శిక్షా జిల్లా అదనపు ప్రాజెక్టు కో ఆర్డినేటర్‌కు సమాచారం ఇవ్వాలి

* బ్యాగులు రెండు (స్కై బ్లూ, నేవీ బ్లూ) రంగులలో, 3 సైజుల్లో (స్మాల్, మీడియం, బిగ్‌ ) మొత్తం 6 రకాలు ఉంటాయి. బాలికలకు స్కై బ్లూ రంగు బ్యాగులు , బాలురకు నేవీ బ్లూ రంగు బ్యాగులు అందజేయాలి

* బ్యాగు డబుల్‌ జిప్పులు, షోల్డర్, డబుల్‌ రివిట్స్, షోల్డర్‌ స్టాప్‌ ఫోమ్, హ్యాండిల్, బ్యాగు ఇన్నర్‌ క్లాత్‌ను నమూనాతో సరిపోల్చి చూడాలి

* బెల్టులు నాలుగు రకాలుగా అందిస్తారు. నాణ్యత బాగాలేకపోయినా, చిరిగిపోయినా , ద్యామేజ్‌ కనిపించినా రిజక్ట్‌ చేసి వెనక్కి పంపవచ్చు

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top