పిల్లలు మాస్కు ధరించడంపై కేంద్ర ప్రభుత్వ తాజా మార్గదర్శకాలు

 తాజా మార్గదర్శకాలు:

★ రానున్న రోజుల్లో కోవిడ్ చిన్నారులపై ప్రభావం చూపే అవకాశాలున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 


★ ఇలాంటి సమయంలో వైరస్‌ వ్యాప్తిని అడ్డుకట్ట వేయడంలో కీలకమైన మాస్కులను చిన్నారులు ధరించవచ్చా? లేదా?అనే అంశంపై కొందరు తల్లిదండ్రుల్లో అయోమయం నెలకొంది. 


★ ఈ నేపథ్యంలో పిల్లలు మాస్కు ధరించడంపై కేంద్ర ప్రభుత్వం మరోసారి మార్గదర్శకాలను జారీచేసింది. 


★ కేంద్ర ఆరోగ్యశాఖ పరిధిలోని డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ (DGHS) ప్రకారం..

★  5 ఏళ్లలోపు చిన్నారులు మాస్కు ధరించాల్సిన అవసరం లేదు.

★ 6-11 ఏళ్ల మధ్య వయసు పిల్లలు మాస్కులను సురక్షితంగా వాడగలిగే సామర్థ్యాన్ని బట్టి ధరించవచ్చు. తల్లిదండ్రులు, సంరక్షకుల పర్యవేక్షణలో ఈ వయసు పిల్లలు మాస్కులు ధరించడం మంచిది.

★ ఇక 12-17 ఏళ్ల వయసున్న వారు మాత్రం పెద్దవారి మాదిరిగానే తప్పకుండా మాస్కులు ధరించాలి.

★ మాస్కులను వాడే సమయంలో చేతులను సబ్బుతో కడుక్కోవడం, లేదా శానిటైజర్‌తో శుభ్రపరచుకోవడం తప్పనిసరి.

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top