ఉద్యోగులకు వాయిదా పద్ధతిలో విద్యుత్ ద్విచక్ర వాహనాలు

 రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేసే ఉద్యోగులకు విద్యుత్‌ ద్విచక్ర వాహనాలను అందించాలని పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ (నెడ్‌క్యాప్‌) నిర్ణయించింది. ఈ ప్రతిపాదనకు కేంద్రం నుంచి అనుమతి లభించింది. తొలిదఫాలో లక్ష వాహనాలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్న నెడ్‌క్యాప్‌.. జులై మొదటి వారంలో ఈ పథకం ప్రారంభించనుంది. ఎలాంటి ముందస్తు చెల్లింపులు లేకుండా నెలవారీ వాయిదాలు కట్టేలా వాహనాల తయారీ సంస్థలతో నెడ్‌క్యాప్‌ ఒప్పందం కుదుర్చుకుంది.

కిలోవాట్‌కు రూ.10 వేలు సబ్సిడీ

ఒక్కో కిలోవాట్‌ బ్యాటరీ సామర్థ్యానికి రూ.10 వేలు చొప్పున కేంద్రం రాయితీ ఇస్తుంది. బండి వేగాన్ని బట్టి గరిష్ఠంగా రూ.25వేల నుంచి రూ.30 వేల వరకు సబ్సిడీ వస్తుంది. నెడ్‌క్యాప్‌ అందించే వాహనాలు గంటకు 25-55 కి.మీల వేగంతో నడవనున్నాయి. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హెవీ ఇండస్ట్రీస్‌ రాయితీ సొమ్ము చెల్లిస్తుంది. వెహికల్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌ ఆమోదించిన నమూనాలను పరిశీలించి రాష్ట్రంలో విక్రయానికి పలు సంస్థలకు కేంద్రం ఆమోదం తెలిపింది. 'సాధారణ ఉద్యోగి రోజుకు సగటున అర లీటరు చొప్పున నెలకు 15 లీటర్ల పెట్రోలు కొనేందుకు సుమారు రూ.1500 ఖర్చు చేయాల్సి వస్తోం ది. విద్యుత్‌ వాహనానికి ఒకసారి బ్యాటరీ ఛార్జింగ్‌ చేస్తే మూడు యూనిట్లు ఖర్చవుతుంది. సుమారు 100 కి.మీ ప్రయాణించవచ్చు. ఇంట్లోనే బ్యాటరీ ఛార్జింగ్‌ పెట్టుకోవచ్చు. పెట్రోలుకు వెచ్చించే మొత్తానికి ఇంకొంత కలిపితే నెలవాయిదా సరిపోతుంది'అనిఅధికారులు చెబుతున్నారు.

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Telugu & English News Papers SSC Model Papers More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top