దేశంలో కరోనా థర్డ్ వేవ్ అనివార్యమని, రాబోయే 6 నుంచి 8 వారాల్లో సంక్రమణ ప్రారంభం అయ్యే అవకాశాలు న్నాయని ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (ఎయిమ్స్) డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా హెచ్చరించారు. కరోనా మూడో వేవ్ కొన్ని నెలల్లో రావచ్చని అనేకమంది నిపుణులు హెచ్చరించిన పరిస్థితుల్లో గులేరియా అప్రమత్తంచేయడం గమనార్హం. అయితే ప్రజలు కోవిడ్ నిబంధనలను పాటించడం, బహిరంగ ప్రదేశాల్లో గుమికూడ కుండా ఉండటం లాంటి జాగ్రత్తలను ఏమేరకు అవ లంభిస్తారనే దానిపై థర్డ్ వేవ్ రాక ఆధారపడి ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. ‘కరోనా కేసులు తగ్గడంతో దేశంలో అన్‌లాక్ ప్రక్రియ మొదలైంది. దీంతో ప్రజలు బయటికి రావడం, కోవిడ్ నిబంధనలను పాటించకపోవడం, ఒకే దగ్గర గుమిగూడడం, సామాజిక దూరాన్ని పాటించకపోవడం జరుగుతుంది. ఫస్ట్, సెకండ్ వేవ్స్ నుంచి ప్రజలు ఏమీ నేర్చుకున్నట్లు లేదు’ అని ఆయన అన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment