ILBS Recruitment 2021: దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బిలియరీ సైన్సెస్ (ఐఎల్‌బీఎస్) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో భాగంగా మొత్తం 90 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. కాంట్రాక్ట్ విధానంలో తీసుకోనున్న ఈ పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 26 టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో ప్రొఫెసర్, అడిషనల్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులున్నాయి.
* టీచింగ్ పోస్టులను అనెస్తీషియా, నెఫ్రాలజీ, న్యూరాలజీ, పల్మనరీ మెడిసిన్, ఆంకాలజీ, లివర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీ, రీనల్ ట్రాన్స్‌ప్లాంట్ విభాగాల్లో తీసుకోనున్నారు.
టీచింగ్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు.. సంబంధిత విభాగాల్లో మెడికల్ పీజీ డిగ్రీ(ఎండీ/ డీఎన్‌బీ/ ఎంసీహెచ్) ఉత్తీర్ణతతో పాటు; పని అనుభవం తప్పనిసరి.
* నాన్ టీచింగ్ విభాగంలో మొత్తం 64 ఖాళీలకుగాను.. సీనియర్ ఫెలో, అసిస్టెంట్ ల్యాబ్ మేనేజర్, హెడ్ ఆపరేషన్స్, మేనేజర్, డిప్యూటీ మేనేజర్, న్యూట్రిషనిస్ట్, ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
* నాన్ టీచింగ్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు.. పోస్టుని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా, బీఎస్సీ(నర్సింగ్), బీకాం, పీజీ డిగ్రీ, ఎమ్మెస్సీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అంతేకాకుండా సంబంధిత విభాగంలో పని అనుభవం తప్పనిసరి.
ముఖ్యమైన విషయాలు:
* అభ్యర్థులను ఇంటర్వ్యూ/ రాత పరీక్ష/ స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీగా 20.07.2021ని నిర్ణయించారు.
0 comments:
Post a Comment