NEP 2020 నూతన విద్యా విధానం ( NEP) పాఠశాలల్లో అమలుకు ప్రభుత్వం జూన్ 14 న మరల సమాచారం సేకరణ

నూతన విద్యా విధానం ( NEP) పాఠశాలల్లో  అమలుకు ప్రభుత్వం జూన్ 14 న మరల సమాచారం సేకరణ

ఉన్నత పాఠశాలలకు ప్రాథమిక పాఠశాలలను మ్యాపింగ్ చేసే కార్యక్రమం.


ప్రధానోపాధ్యాయులకు,CRPలకు కి అందిన  సూచనలు..


•రాష్ట్ర కార్యాలయం నుంచి వచ్చిన సమాచారం ప్రకారం సోమవారం  ఉదయం  జిల్లాలోని ప్రతి ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన లాగిన్ లో ఆ పాఠశాలకు సమీపంలోని  ప్రాధమిక పాఠశాలలను మాప్ చేయవలసి ఉంటుంది.


•ప్రభుత్వ  ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు లాగిన్ లో వివరాలు నమోదు చేయుటకు అవకాశం కల్పించబడింది. 


•స్కూల్ ప్రెమిసెస్ లో ఉన్నవి , లేనివి , సమీపం , ప్రభుత్వ మానేజ్ మెంట్ , అవరోధాలు వంటి అంశాలను పరిగణన లోకి తీసుకోవాలి. 


•మూడు కిలోమీటర్ల లోపల ఉన్నటువంటి పాఠశాలలను మాత్రమే మ్యాపింగ్ చేయవలసి ఉంటుంది.


•ఇది కేవలం సమాచార సేకరణకు సంబంధించిన అంశం మాత్రమే. దీనికి ఇప్పుడు చర్చించబడుతున్న మార్పులకు సంబంధం లేదు. దయచేసి ఉన్నత  పాఠశాల ప్రధానోపాధ్యాయులు గమనించాలి. 


•లాగిన్ లో వివరాల నమోదు మాత్రం తప్పులు లేకుండా చూసుకోవాలి. 


•ప్రతి HM తను పనిచేస్తున్న ఉన్నత  పాఠశాలకు  సమీపంలోని  ప్రాధమిక పాఠశాలలను మ్యాప్  చేయవలెను.


•మాపింగ్ చేయడానికి ముందే స్కూళ్ళ కి సంబంధించిన సమాచారాన్ని ప్రధానోపాధ్యాయులు డేటా సేకరించి పైనల్ చేసుకోవాలి.

  

•జిల్లాలోని అందరు ఉన్నత  పాఠశాల ప్రధానోపాధ్యాయులు  మీ పరిధిలోని ప్రాధమిక పాఠశాలల లోని తరగతి వారి విద్యార్థుల సంఖ్య... తరగతి గదులు సంఖ్య...  ఉన్నత పాఠశాల నుండి ప్రాధమిక పాఠశాలలకున్న  దూరము.... వంటి వివరాలను సేకరించు కోవాలి.  

 

•ఇతర ప్రభుత్వ మేనేజ్మెంట్  పాఠశాలకు అయినా సరే మ్యాపింగ్ చేయవచ్చును. అనగా ఉన్నత పాఠశాలకు మ్యాపింగ్ చేయబోతున్న ప్రాథమిక పాఠశాల  ఓకే మేనేజ్మెంట్ అయి ఉండవలసిన అవసరం లేదు.


•దీనికి మండలమే కాకుండా తన పక్కనున్న మండలంలోని పాఠశాలలను కూడా సమీపం ఆధారంగా మ్యాపింగ్ చేయవచ్చును.


•కాబట్టి జిల్లాలోని ప్రధానోపాధ్యాయులు అందరూ కూడా మీ సమీపంలోని ప్రభుత్వ పాఠశాలల వివరాలను సేకరించుకుని HM లాగిన్ నందు  లింక్  ఇవ్వగానే జాగ్రత్తగా పరిశీలించి నమోదు చేయవలెను. 


• సి ఆర్ పి లు అందరూ కూడా సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులుకి ఈ అంశమై తోడ్పాటును అందించ వలెను.


•ఎం ఆర్ సి సిబ్బంది కూడా తగిన సహకారం అందించవలసిందిగా తెలియజేయడమైనది.


•మీ మండలాలకు సంబంధించిన స్కూల్స్ డిస్ప్లే లో  ప్రాబ్లం ఉన్నట్లయితే వెంటనే సంప్రదించాలి.


•ప్రధాన ఉపాధ్యాయులు ప్రాథమిక పాఠశాలలు మ్యాపింగ్ చేసేటప్పుడు మీడియం అంశము పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు.


•అలాగే  హై వె లు, కాలువలు  రైల్వే ట్రాక్ ల వంటివి అవరోధాలుగా ఉన్నప్పుడు జాగ్రత్త గా పరిశీలించి నమోదు చేయాలి. 


•APMS  మరియు KGBV వంటి రెసిడెన్షియల్ పాఠశాలలు కుడా ప్రాధమిక పాఠశాలలను మ్యాప్  చేయవలెను. (ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం ) 


•మీరు సబ్మిట్ చేసేటప్పుడు ఒకసారి జాగ్రత్తగా చెక్ చేసుకొని సబ్మిట్ చేయవలసిందిగా కోరుచున్నాము.


•కాబట్టి ఈ అంశం మీద తగు ప్రణాళిక తయారు చేసుకుని  మాపింగ్ చేయవలసినదిగా తెలియ జేయడమైనది.


•తదుపరి సమాచారం రేపు 14-06-2021 న లాగిన్ ఇవ్వగానే తెలియజేయబడుతుంది. 


•ఉన్నత పాఠశాలలకు,ప్రాథమిక పాఠశాలలను మ్యాపింగ్ చేసే క్రమంలో ఏవైనా సమస్యలు ఉత్పన్నమైతే  గూగుల్ ఫాం ఇవ్వబడుతుంది. అందులో సమస్యలు  సబ్మిట్ చేయవలసినదిగా జిల్లాల DEO లు కోరుతున్నారు!

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top