ఎల్పీజీ సిలిండర్ వినియోగదారులకు కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కారు శుభవార్త తెలిపింది. ఇకపై వంటగ్యాస్ వినియోగదారులు తమకు నచ్చిన డిస్ట్రిబ్యూటర్‌ను ఎంపిక చేసుకోవచ్చు. అంటే వినియోగదారులు ఇకపై ఏ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ వద్దనుంచైనా సిలిండర్ ఫిల్ చేయించుకోవచ్చు. ఇంతవరకూ వంట గ్యాస్ వినియోగదారులు ఏదో ఒక డిస్ట్రిబ్యూటర్ వద్దనే గ్యాస్ సిలిండర్ ఫిల్ చేయించుకోవలసి వస్తోంది. లోక్ సభలో కొందరు ఎంపీలు... ఎల్పీజీ వినియోగదారులు స్వయంగా డిస్ట్రిబ్యూటర్‌ను ఎంపిక చేసుకోలేరా అని ప్రశ్నించగా దానికి కేంద్ర పెట్రోలియం, సహజ ఇంధన వనరులశాఖ మంత్రి రామేశ్వర్ తెలీ సమాధానమిచ్చారు. ఇకపై వంట గ్యాస్ వినియోగదారులు తమకు నచ్చిన డిస్ట్రిబ్యూటర్‌ను ఎంపిక చేసుకుని, తమ గ్యాస్ సిలిండర్ ఫిల్ చేయించుకోవచ్చని తెలిపారు.
0 comments:
Post a Comment