NPS Scheme: పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (PFRDA) తాజాగా శుభవార్త తెలిపింది. ఎన్‌పీఎస్ (NPS) స్కీమ్‌లో చేరిన వారికి శుభవార్త చెప్పింది. ఇందులో భాగంగా లబ్ధిదారులకు చెల్లింపులు ఇక ఆలస్యం అయ్యే అవకాశం ఉండదు. ఎన్‌పీఎస్ సబ్‌స్క్రైబర్ల కోసం పీఎఫ్ఆర్‌డీఏ తాజాగా పెన్నీ డ్రాప్ ఫీచర్ ద్వారా తక్షణం బ్యాంక్ అకౌంట్‌ను వెరిఫై చేసుకునే సౌకర్యం కల్పించింది. దీంతో నగదు లావాదేవీల ఉపసంహరణ ప్రక్రియ మరింత వేగవంతంగా పూర్తికానుంది. కొత్త సేవల్లో భాగంగా ఎన్‌పీఎస్ స్కీమ్‌లో చేరిన వారు వారి బ్యాంక్ ఖాతా యాక్టివ్‌గా ఉందా? లేదా? అని సులభంగానే చెక్ చేసుకోవచ్చు.చాలా మంది వారి ఎన్‌పీఎస్ ఖాతా నుంచి డబ్బులు విత్‌డ్రా చేసుకోవాలని ప్రయతనిస్తే ఆ డబ్బులు బ్యాంక్ ఖాతాల్లో జమ కావడం లేదు. దీనికి చాలా కారణాలు ఉండవచ్చు. ఐఎఫ్ఎస్‌సీ కోడ్ తప్పుగా ఉండటం, పేరు మ్యాచ్ కాకపోవడం, బ్యాంక్ ఖాతా ఇన్‌యాక్టివ్‌లో ఉండటం, అలాగే ఖాతా మూసివేయబడటం, ఖాతా నెంబర్ తప్పుగా ఉండటం ఇలా రకరకాల కారణాలుఉంటాయి. అయితేఇలాంటి కారణాల వల్ల లబ్ధిదారులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ముందుగానే బ్యాంక్ ఖాతా వివరాలను చెక్ చేసుకునే వెసులుబాటు పీఎఫ్ఆర్‌డీఏ ఇప్పుడు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇన్‌స్టంట్ బ్యాంక్ అకౌంట్ వెరిఫికేషన్ ఫీచర్ ద్వారా ఈ సమస్యలకు పరిష్కారం పొందే అవకాశం ఉంటుంది.
Subscribe to:
Post Comments (Atom)


Learn a Word September 2022 Schedule
0 comments:
Post a Comment