జి.ఓ.నం.45, తేదీ 5.7.2021
👉 ఉద్యోగికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయితే :
20 రోజుల వరకు ఏ విధమైన వైద్య ధ్రువపత్రం లేకుండా పాజిటివ్ రిపోర్ట్ పై కమ్యుటెడ్ మెడికల్ లీవ్ మంజూరు చేస్తారు. కమిటెడ్ మెడికల్ లీవ్ లేకపోతే 15 రోజుల స్పెషల్ క్యాజువల్ లీవ్, తదుపరి సంపాదిత సెలవులు, అర్ధవేతన సెలవు, జీత నష్టపు మంజూరు చేస్తారు. జీతం నష్టపు సెలవు సర్వీసుకు లెక్కిస్తారు.
👉 హోమ్ ఐసోలేషన్ లేదా హాస్పిటల్ లో చేరినప్పుడు:
20 రోజులు వరకు ఏ విధమైన వైద్య ధ్రువపత్రం లేకుండా, రిపోర్ట్ మీద కమ్యుటెడ్ మెడికల్ లీవ్ మంజూరు. 20 రోజులు మించితే హాస్పటల్ వారు ఇచ్ఛే ధ్రువపత్రం మేరకు కమ్యూటెడ్ లీవ్ మంజూరు. హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయిన తదుపరి కూడా ఉద్యోగి సెలవు కోరుకుంటే అర్హత కలిగిన సెలవు మంజూరు చేస్తారు.
👉 కుటుంబ సభ్యులకు, ఆధారితులకు కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయినప్పుడు:
15 రోజుల స్పెషల్ క్యాజువల్ లీవ్ పాజిటివ్ రిపోర్ట్ సమర్పించిన మేరకు మంజూరు చేస్తారు. ఇంకా మించితే అర్హత గల సెలవు మంజూరు చేస్తారు.
👉 హోమ్ క్వారంటైన్ లో ఉంటే:
విధినిర్వహణలో ఉన్నట్లుగా ఆన్ డ్యూటీ గా 7 రోజుల వరకూ పరిగణిస్తారు. అంతకు మించితే కార్యాలయం నుండి ఇచ్చే సూచనల మేరకు వ్యవహరిస్తారు.
👉కంటోన్మెంట్ జోన్లో ఉంటున్న వారికి:
కంటెంట్మెంట్ జోన్ గా డీనోటిఫై చేసే వరకు ఆన్ డ్యూటీ లేదా వర్క్ ఫ్రం హోం గా భావిస్తారు.
పై ఉత్తర్వులన్నీ మార్చి 25, 2020 నుండి వర్తిస్తాయి.
Regularization of hospitalization/quarantine period during COVID-19 Pandemic - Sanction w.e.f. 25-03-2020 - Orders - GO.No:45 Dt:05.07.21 Download Copy


Learn a Word September 2022 Schedule
0 comments:
Post a Comment