ప్రత్యామ్నాయ విద్యా ప్రణాళిక అమలుకు సచివాలయం పరిధిలో ఈరోజు సమావేశాలు

 ప్రత్యామ్నాయ విద్యా ప్రణాళిక

★ ప్రత్యామ్నాయ విద్యా ప్రణాళిక అమలుకు సంబంధించి మంగళవారం నిర్వహించే సమావేశానికి సచివాలయం పరిధిలో ఆయా ప్రభుత్వ పాఠశాలలకు చెందిన

★  ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులతో పాటు 

★ వార్డు, గ్రామ సచివాలయ కార్యదర్శులు, 

★ వాలంటీర్లు, 

★ క్లస్టర్‌ రిసోర్స్‌పర్సన్లు, 

★ అంగన్‌వాడీ టీచర్లు, 

★ తల్లిదండ్రుల కమిటీ సభ్యులను ఆహ్వానించారు.


ప్రణాళికలో ముఖ్యాంశాలివి

★ ప్రతి బడిలో విద్యార్థుల సంఖ్య ఆధారంగా బృందాలుగా విభజించాలి. ఒక్కో ఉపాధ్యాయ బృందానికి 15 మంది విద్యార్థులకు మించకూడదు. రేడియో, దూర్‌దర్శన్‌లో ప్రసారమయ్యే డిజిటల్‌ కంటెంట్‌ అభ్యసనాలను వీక్షించి, ఆలకించేలా విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలి.

★ విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, ఉపాధ్యాయుల్లో బోధనా సామర్థ్యాలు బాగా ఉన్న వారిని గుర్తించాలి. ఉపాధ్యాయులు లేని చోట్ల పర్యవేక్షణ బాధ్యతలు వారికి అప్పగించాలి.

★ బడిబయట పిల్లలను గుర్తించి వారికి బోధన చేయాలి.

★ వివిధ మాధ్యమాల ద్వారా విద్యకు సంబంధించి వచ్చే డిజిటల్‌ కంటెంట్‌ను ఉపాధ్యాయులు సేకరించి విద్యార్థులకు అందజేయాలి. ఉదాహరణకు దీక్ష కంటెంట్‌ తదితరాలు.

★ ఆడియో, వీడియోలను స్థానిక కేబుల్‌ నెట్‌వర్క్‌ల ద్వారా విద్యార్థులకు చేరేలా నెట్‌వర్క్‌ యాజామాన్యాల సహకారం పొందాలి. ఈ బాధ్యతలను ప్రధానోపాధ్యాయులు చూడాలి.

★ గ్రంథాలయాలను వినియోగించుకునేలా విద్యార్థులను ప్రోత్సహించాలి.

★ ఆన్‌లైన్‌ తరగతులకు సాంకేతిక సమస్యలు వస్తే వెంటనే పరిష్కరించడానికి స్థానికంగా ఉన్నత విద్య చదివిన వారిని గుర్తించాలి. వారి సహకారంతో ఈ సమస్యను అధిగమించాలి.

★ కొవిడ్‌ పరిస్థితులపై విద్యార్థులు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలి.

★ విద్యార్థుల ప్రగతిని హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు సమీక్షించాలి. విద్యార్థులు ఏం చదివారు, ఏం నేర్చుకున్నారో రికార్డు చేయాలి.

★ అవసరమైతే డిజిటల్‌, వర్చువల్‌ తరగతులను వినియోగించుకోవడానికి పాఠశాలలను సంసిద్ధం చేసుకోవాలి.

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top