SSC Results: పదో తరగతి గ్రేడ్లను ఇలా నిర్ణయిస్తారు....
2020–21 విద్యాసంవత్సరానికి సంబంధించిన విద్యార్థులకు ఫార్మేటివ్–1, ఫార్మేటివ్–2 మార్కులను తీసుకుని గ్రేడ్లు ప్రకటిస్తారు. ఎఫ్‌ఏ(ఫార్మేటివ్ అసెస్‌మెంట్) పరీక్షలకు సంబంధించి లిఖిత పూర్వక పరీక్షలు, ఇతర పరీక్షలను విభజిస్తారు. ఎఫ్‌ఏ–1లోని లిఖిత పరీక్షకు సంబంధించిన 20 మార్కులను 70 శాతానికి పెంపుచేస్తారు. ఇతర 3 రకాల పరీక్షలకు సంబంధించిన 30 మార్కులను 30 శాతంగా పరిగణిస్తారు. ఉదాహరణకు 2020–21 విద్యాసంవత్సరానికి సంబంధించి ఒక విద్యార్థికి ఎఫ్‌ఏ–1 లిఖిత పూర్వక పరీక్షలో 20 మార్కులకు 18 మార్కులు వస్తే వాటిని 70 శాతానికి పెంపుచేసి 31.5 మార్కులుగా పరిగణిస్తారు. మిగతా మూడు విభాగాల్లో 30 మార్కులకు 27 మార్కులు సాధించి ఉంటే వాటిని 30 శాతానికి కుదింపుచేసి 13.5 మార్కులు వచ్చినట్టుగా పరిగణిస్తారు. మొత్తంగా ఎఫ్‌ఏ–1లో ఆ విద్యార్థికి 45 మార్కులు వచ్చినట్టుగా ప్రకటిస్తారు. అదే విధంగా ఎఫ్‌ఏ–2 మార్కులనూ విభజిస్తారు. ఎఫ్‌ఏ–2లో ఆ విద్యార్థికి 47 మార్కులొస్తే కనుక ఆ రెంటినీ కలిపి 100 మార్కులకు 92 మార్కులు సాధించినట్టుగా.. గ్రేడును నిర్ణయిస్తారు.
0 comments:
Post a Comment