UPI Apps: మీ ఫోన్ పోతే యూపీఐ యాప్స్ ను ఎలా బ్లాక్ చేయాలి?

 మీ ఫోన్ పోతే యూపీఐ యాప్స్ ను ఎలా బ్లాక్ చేయాలి?


భారతదేశంలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్(యుపీఐ) టెక్నాలజీ సహాయంతో పేటిఎమ్, గూగుల్ పే, ఫోన్ పే వంటి ఇతర పేమెంట్ యాప్స్ పనిచేస్తున్నాయి. చాలా మంది వినియోగదారులు యుపీఐతో లింక్ చేయబడిన వారి ఫోన్లలో కనీసం ఈ మూడింటిలో ఒక పేమెంట్ యాప్స్ అయిన కలిగి ఉన్నారు. యుపీఐ ద్వారా ఎవరికైనా డబ్బును క్షణాలలో బదిలీ చేయవచ్చు. ఎవరైనా మీ ఫోన్ యాక్సెస్ చేస్తే వారు డబ్బును బదిలీ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీ పేమెంట్ యాప్స్ గల స్మార్ట్ ఫోన్ ఎవరైనా దొంగలిస్తే ఏమి జరుగుతుంది?. వారు మీ బ్యాంకులో ఉన్న మొత్తం నగదును డ్రా చేసే అవకాశం ఉంటుంది.



కాబట్టి మీ ఫోన్ కోల్పోయినట్లయితే లేదా ఎవరైనా దొంగలిస్తే ఈ సర్వీసులు యాక్సెస్ చేసుకోకుండా మనం చేయవచ్చు. మీ ఫోన్ పోతే పేటిఎమ్, గూగుల్ పే, ఫోన్ పేని మీరు ఏ విధంగా బ్లాక్ చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇలా బ్లాక్ చేయడం వల్ల వారు మీ ఖాతాలో నుంచి డబ్బును డ్రా చేయలేరు.


పేటిఎమ్ ఖాతాను తాత్కాలికంగా ఎలా బ్లాక్ చేయాలి?


పేటిఎమ్ పేమెంట్స్ బ్యాంక్ హెల్ప్ లైన్ నెంబరు 01204456456కు కాల్ చేయండి.


పోయిన ఫోన్ కొరకు ఆప్షన్ ఎంచుకోండి


వేరే నెంబరు నమోదు చేయడానికి ఆప్షన్ ఎంచుకోండి, మీ కోల్పోయిన ఫోన్ నెంబరును నమోదు చేయండి.


అన్ని పరికరాల నుంచి లాగ్ అవుట్ అయ్యే ఆప్షన్ ఎంచుకోండి.


తరువాత, పేటిఎమ్ వెబ్ సైట్ కు వెళ్లండి, 24ఎక్స్7 హెల్ప్ఎంచుకోవడానికి దిగువకు స్క్రోల్ చేయండి.


Report a Fraud అనే దాన్ని ఎంచుకోండి, ఏదైనా కేటగిరీపై క్లిక్ చేయండి.


తర్వాత, ఏదైనా సమస్యపై క్లిక్ చేయండి, ఇప్పుడు దిగువన ఉన్న  Message Us బటన్ మీద క్లిక్ చేయండి.


పేటిఎమ్ ఖాతా లావాదేవీలను చూపించే డెబిట్/క్రెడిట్ కార్డు స్టేట్ మెంట్ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.


తర్వాత పేటిఎమ్ మీ ఖాతాను ధ్రువీకరిస్తుంది, బ్లాక్ చేస్తుంది. తర్వాత మీరు ధృవీకరణ సందేశాన్ని అందుకుంటారు.

గూగుల్ పే ఖాతాను ఎలా బ్లాక్ చేయాలి?


గూగుల్ పే వినియోగదారులు హెల్ప్ లైన్ నంబర్ 18004190157కు కాల్ చేసి మీ మాతృ భాషను ఎంచుకోండి.

ఇతర సమస్యలకు సరైన ఆప్షన్ ఎంచుకోండి.

మీ Google Payకు ప్రత్యామ్నాయంగా ఆండ్రాయిడ్ వినియోగదారులు తమ డేటాను రిమోట్ వైప్ చేయవచ్చు. తద్వారా ఫోన్ నుంచి మీ గూగుల్ ఖాతాను ఎవరూ యాక్సెస్ చేసుకోలేరు.


ఐఓఎస్ వినియోగదారులు కూడా తమ డేటాను రిమోట్ ఆప్షన్ ద్వారా బ్లాక్ చేయవచ్చు.


ఫోన్ పే ఖాతాను ఎలా బ్లాక్ చేయాలి?

ఫోన్ పే వినియోగదారులు 08068727374 లేదా 02268727374 కాల్ చేయాల్సి ఉంటుంది.

మీ మాతృ భాషను ఎంచుకున్న తరువాత, మీ ఫోన్ పే ఖాతాతో సమస్యను నివేదించాలనుకుంటున్నారా అని మిమ్మల్ని అడుగుతారు అప్పుడు దానికి తగిన నెంబరును నొక్కండి.

ఇప్పుడు రిజిస్టర్డ్ నెంబరు నమోదు చేయండి. ధృవీకరణ కొరకు మీకు ఓటీపీ పంపబడుతుంది.

తర్వాత ఓటీపీ అందుకోనందుకు ఆప్షన్ ఎంచుకోండి.

దీని వల్ల సీమ్ లేదా మొబైల్ నష్టం గురించి మీకు ఆప్షన్ రిపోర్ట్ ఇవ్వబడుతుంది, దానిని ఎంచుకోండి.

ఫోన్ నెంబరు, ఇమెయిల్ ఐడి, చివరి పేమెంట్, చివరి లావాదేవీ విలువ మొదలైన కొన్ని వివరాలను పొందిన తరువాత మీ ఫోన్ పే అకౌంట్ ని బ్లాక్ చేయడంలో మీకు సహాయపడే ప్రతినిధితో మీరు కనెక్ట్ అవుతారు

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top