విద్యాశాఖ డైరెక్టర్ వాడ్రేవు చినవీరభధ్రుడు గారితో సర్వీస్ రూల్స్ తదితర, ఉపాద్యాయ సమస్యల పై సుహృద్భావ వాతావరణం లో ఫ్యాప్టో సుదీర్ఘ చర్చలు

 *విద్యాశాఖ  డైరెక్టర్ వాడ్రేవు చినవీరభధ్రుడు గారితో   సర్వీస్ రూల్స్ తదితర, ఉపాద్యాయ సమస్యల పై సుహృద్భావ వాతావరణం లో ఫ్యాప్టో  సుదీర్ఘ చర్చలు*



1    *గత 20సం.ల నుండి పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయుల సర్వీస్ రూల్స్ పై డైరెక్టర్ శ్రీ.చిన్న వీరభద్రుడు గారితో  FAPTO రాష్ట్ర నాయకత్వంతో నేడు డైరెక్టరేట్ లో సుదీర్ఘ చర్చలు జరిగాయి. గతంలో రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేయడం వల్ల సర్వీస్  రూల్స్ ఆంధ్రప్రదేశ్ లో 72,73, 74 ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే వీటిపై అప్పటి ట్రిబ్యునల్ లో కేస్ వేశారు. దీనిపై ప్రత్యేక చొరవ చూపిస్తామని లేదా నూతన రూల్స్ రూపొందించి దసరా సెలవుల్లో అన్ని కేడర్ల పదోన్నతులు కల్పిస్తామని డైరెక్టర్ గారు  తెల్పారు*.


2  *పాఠశాలల్లో అనేక రకాల యాప్స్ అప్లోడింగ్స్ వల్ల అకడమిక్ దెబ్బతింటుందని FAPTO తెల్పగా మంత్రి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో మాట్లాడి పరిష్కారం చూపుతామని తెల్పారు*.


3 *ఉపాధ్యాయులు, హెడ్మాస్టర్ లపై దాడులు చేస్తున్న అగంతుకులపై చర్యలు తీసుకొనుటకు ప్రత్యేక చట్టం రూపొందించాలని ప్రతిపాదనలు పంపాలని కోరడం జరిగింది*.


4  *అప్గ్రడెడ్ పాఠశాలలకు 400 ప్రధానోపాధ్యాయులు పోస్టులు త్వరలో మంజూరుకు చర్యలు*


5 *ఈ అకడమిక్ సం.లో అన్ని సెలవులను యధాతధంగా వాడుకోవడానికి త్వరలో ఉత్తర్వులు  జారీ చేస్తారు*.


6  *2002 పదోన్నతుల టీచర్ల సర్వీస్ మేటర్స్ ను సెట్ చేస్తామన్నారు*.


7 *వేసవిలో నాడు - నేడు పనులు నిర్వహించిన HM/ టీచర్స్ కు EL's మంజూరుకు త్వరలో ఉత్తర్వులు*


8 *Sanitary వర్కర్స్ కు రూ 6000/- నెలకు ఆగష్టు నుండి ఇవ్వడానికి సి యం అంగీకారం తెల్పారని తెల్పారు*


9  *పెండింగ్ లో ఉన్న క్రాఫ్ట్, డ్రాయింగ్ టీచర్ల ట్రాన్స్ఫర్ లు 3 రోజుల్లో పూర్తి*


10 *త్వరలో MEO TRANSFERS చేపడతామని తెల్పారు*.


11 *ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు వాయిదా పడలేదని , ప్రభుత్వం నిర్ణయించిన తేదీన ప్రధానం చేస్తామని అన్నారు*


12 *స్కూల్ మెయింటినెన్స్  గ్రాంట్స్ ఇవ్వడానికి అంగీకారం*


*ఈ సమావేశంలో డైరెక్టర్ శ్రీ చిన్న వీరభద్రుడు గారు, SCERT డైరెక్టర్ ప్రతాప్ రెడ్డి  గారు మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు* 


  *FAPTO ఛైర్మన్ సి.హెచ్ జోసెఫ్ సుధీర్ బాబు, సెక్రెటరీ జనరల్ సి.హెచ్ శరత్ చంద్ర, కో - చైర్మన్లు నక్కావెంకటేశ్వర్లు,వి.శ్రీనివాసులు కార్యవర్గ సభ్యులు ఏపీ జెఏసి సెక్రెటరీ జనరల్ జి.హృదయ రాజు, కార్యవర్గ సభ్యులు KSS ప్రసాద్ లు పాల్గొన్నారు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు*


... *చైర్మన్ & సెక్రటరీ జనరల్

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

Top