HM Association - పాఠశాల విద్యా సంచాలకులు వారితో జరిగిన చర్చలు ముఖ్యాంశాలు

ఆంధ్రప్రదేశ్ ప్రధానోపాధ్యాయ సంఘం నాయకులతో ఆయన కార్యాలయంలో సోమవారం చర్చలు జరిపారు

▪️సర్వర్ సామర్థ్యం పెంచి యాప్ల వినియోగం సులభతరం చేస్తామని హామీ ఇచ్చారు..


▪️జగనన్న విద్యాకానుక పంపిణీ, బయోమెట్రిక్ తదితర అంశాల్లో సమస్యల పరిష్కారానికి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. 


▪️పాఠశాలల్లో టాయిలెట్స్ నిర్వహణ శానిటరీ వర్కర్లకు ఆగస్టు నుంచి రూ.6 వేల చొప్పున గౌరవ వేతనం చెల్లించడానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తామన్నారు. 

▪️9, 10 తరగతులవిద్యార్థులకు ప్రత్యేక ఫీజు వసూలును రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇస్తామన్నారు. 

▪️నాడు నేడు అభివృద్ధి చేసిన పాఠశాలలకు కరెంట్ బిల్లు, ఇతర మెయింటెనెన్స్ ఖర్చుల నిమిత్తం ప్రతి హైస్కూల్కు రూ.5 లక్షలు మంజూరు చేస్తామన్నారు. 

▪️ఖాళీగా ఉన్న ఎంఇఒ, ఉప విద్యాశాఖ అధికారులు పోస్టులను తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేస్తామన్నారు. 

▪️అప్గ్రేడ్ పాఠశాలలకు ప్రధానోపాధ్యాయుల పోస్టుల మంజూరుపై ఆర్థిక శాఖకు మరోసారి ప్రతిపాదనలు పంపుతామని తెలిపారు. 

▪️జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న బోధనేతర సిబ్బందిని రేషనలైజేషన్ చేయడానికి పంచాయతీరాజ్ కమిషనర్ను సంప్రదించి పరిష్కారిస్తామన్నారు.

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top