ITR Filing: ఆదాయపు పన్ను.. ఏ ఫారం.. ఎవరి కోసం?

ITR Filing:

 ఆదాయపు పన్ను.. ఏ ఫారం.. ఎవరి కోసం?

*ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయాల్సిన సమయం ఇది. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం ఈ గడువు సెప్టెంబరు 30

అయితే, చివరి నిమిషంలో హడావుడి పడకుండా.. ముందే రిటర్నులు సమర్పించడం ఎంతో అవసరం. చాలామంది తమ రిటర్నులను దాఖలు చేసేందుకు ఏ ఫారం వినియోగించాలని సందేహిస్తుంటారు. ఏ ఫారం ఎవరికి వర్తిస్తుంది.. ఎవరు ఉపయోగించకూడదో తెలుసుకుందాం..


ఐటీఆర్‌-1: భారతీయ పౌరులై, రూ.50లక్షల లోపు ఆదాయం ఉన్నవారు ఐటీఆర్‌-1ను ఉపయోగించేందుకు వీలుంటుంది. అయితే, మూలధన లాభం (క్యాపిటల్‌ గెయిన్స్‌) ఉండకూడదు. దీంతోపాటు వ్యాపారం లేదా వృత్తి ద్వారా లాభం/నష్టం వచ్చినప్పుడూ ఈ ఫారం ఉపయోగించడానికి వీల్లేదు. వేతనం ద్వారా ఆదాయం, ఒక ఇంటి నుంచి ఆదాయం, ఇతర మార్గాల ద్వారా (వడ్డీ) ఆదాయంలాంటివి ఉన్నప్పుడే ఐటీఆర్‌-1 ను దాఖలు చేయాల్సి ఉంటుంది. వేతనం ద్వారా ఆదాయం కాకుండా.. వృత్తి లేదా వ్యాపారం ద్వారా ఆర్జించి, అందులో ఖర్చులను చూపించాలనుకున్నప్పుడు ఐటీఆర్‌-1 వర్తించదు.

ఐటీఆర్‌-2:

👉ఐటీఆర్‌ -1 ఫారం వర్తించని వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు ఈ ఐటీఆర్‌-2ని వినియోగించవచ్చు. వ్యాపారం, వృత్తిద్వారా ఆదాయం ఆర్జించే వారికి ఇది సరిపోదు. డివిడెండ్లు, ఇతర ఆదాయాలు వచ్చిన వారూ ఈ ఫారాన్ని వినియోగించేందుకు వీలుంది. కొంతమంది షేర్ల నుంచి వచ్చిన లాభాలను ఇతర వనరుల నుంచి వచ్చిన ఆదాయంగా చూపించేందుకు  ప్రయత్నిస్తుంటారు. కానీ, ఇది పొరపాటు.

ఐటీఆర్‌ 3:

👉 ఇది కాస్త క్లిష్టమైన ఫారం. వ్యాపారం, వృత్తి ద్వారా ఆదాయం ఆర్జించే వ్యక్తులు, హెచ్‌యూఎఫ్‌లు ఈ ఫారంలో తమ రిటర్నులు సమర్పించాల్సి ఉంటుంది. పన్ను వర్తించే ఆదాయం రూ.50లక్షలు దాటినప్పుడూ ఈ ఫారాన్ని వాడాల్సి ఉంటుంది. క్యాపిటల్‌ గెయిన్స్‌ ఉన్నవారూ.. ఈ ఫారాన్ని వినియోగించవచ్చు. దీన్ని సొంతంగా పూర్తి చేయడం కాస్త కష్టమే. కాబట్టి, నిపుణులను సంప్రదించడం మేలు.

ఐటీఆర్‌-4:

దీన్నే సుగమ్‌ అనీ పిలుస్తారు.

 వ్యక్తులు, హెచ్‌యూఎఫ్‌లు, భాగస్వామ్య సంస్థలు అంచనా ఆధారంగా ఆదాయాన్ని పేర్కొనే వారు ఈ ఫారాన్ని వినియోగించుకోవచ్చు.

ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేయడం ఒక్కటే కాదు.. వాటిని సరైన ఫారాల్లోనే దాఖలు చేయాలి. లేకపోతే అవి చెల్లకుండా పోయే ప్రమాదం ఉంది.


Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top