Parents committee ఎన్నికలు -ఎన్నికల మార్గదర్శకాలు ఇవే..

Parents committee ఎన్నికలు -ఎన్నికల మార్గదర్శకాలు ఇవే..

*ఈ నెల 16న నోటిఫికేషన్

*22న ఎన్నిక, అదే రోజు అధ్యక్ష, ఉపాధ్యక్షుల ప్రమాణ స్వీకారం

ప్రతి పాఠశాలలో ఎన్నికలను హెచ్ఎంలు నిర్వహిస్తారు. 50 శాతం తల్లిదండ్రులు లేదా సంరక్షకులు ఉండాలి. కోరం రూపొందించే సమయంను ప్రధానోపాధ్యాయుడు నిర్ణయిస్తారు.

* చేతులు ఎత్తే పద్దతి లేదా నోటితో చెప్పే పద్ధతి ద్వారా ఎన్నిక ఉంటుంది. అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే రహస్య ఓటింగ్ నిర్వహించాలి.

- వివిధ తరగతుల్లో పిల్లలున్న తల్లిదండ్రులు ఎన్నికల్లో పాల్గొనేందుకు అర్హులు.

- ఎన్నికైన పేరెంట్స్ కమిటీ సభ్యుల నుంచి చైర్మన్, వైస్ చైర్మన్లను ఎన్నుకోవాలి. వీరిలో కనీసం ఒకరు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారితో పాటు ఒకరు మహిళ అయి ఉండాలి.

- స్థానిక సంస్థల్లో ఉన్న సభ్యులు, హెచ్ఎంలు ఓటింగ్ లో పాల్గొనేందుకు అనర్హులు.

* ఓటు హక్కు కలిగిన పేరెంట్/ గార్డియన్లు కొత్తగా అవసరమైన తల్లిదండ్రుల కమిటీ సభ్యులను ఎన్నుకుంటారు. ఖాళీ అయిన సభ్యుల స్థానంలో కూడా కొత్త వారిని ఎన్నుకోవచ్చు.

* ఒకసారి ఎన్నికైన పేరెంట్స్ కమిటీని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాశాలల్లో యంఈవో, ఇతర పాఠశాలల్లో డీఈవోల ఆదేశాల ప్రకారం రద్దు లేదా ఇతర పాఠశాలల్లో విలీనం అయ్యేంతవరకు కొనసాగుతాయి.

* ఒక కిలోమీటరు దూరంలో గల ప్రాథమిక పాఠశాల, 3 కిలోమీటర్ల దూరంలో గల ఆవాస ప్రాంతాలను నైబర్ హుడ్ ఏరియా ఆఫ్ స్కూల్స్ గా పేర్కొంటారు.

* ఎన్నికల ప్రక్రియలో రాజకీయ జోక్యం ఉండరాదు. ఎన్నికలకు ఇబ్బందులు కలిగిస్తే అట్టి వారు చట్టరీత్యా శిక్షార్హులు.

* పరిశీలకులుగా తహసీల్దారు/ ఎంపీడీఓ, విలేజ్ కార్యదర్శి లేదా వీఆర్ఓలు ఎన్నికల కార్యక్రమంలో పాలు పంచుకుంటారు.

* ఓటింగ్ లో పాల్గొనాలంటే ఓటింగ్ కోసం జారీచేసిన ఓటింగ్ గుర్తింపు కార్డు, రేషన్ కార్డు, ఆధార్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్కార్డు, ప్రభుత్వం జారీ చేసిన ఇతర ఏదైనా గుర్తింపు కార్డు తప్పనిసరి.

- డిజడ్వాంటేజెస్, వీకర్స్ సభ్యులు లేని పక్షంలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా సభ్యులను ఎన్నుకోవాలి.

పేరెంట్స్ కమిటీ నిర్మాణం

ప్రతి తరగతికి ముగ్గురు సభ్యులను ఎన్నుకోవాలి. వారిలో ఇద్దరు మహిళలు. ముగ్గురిలో ఒకరు ఎస్.సి/ ఎస్.టి, మరొకరు బి.సి అయి ఉండాలి. ఎన్నికైన సభ్యుల కాలపరిమితి 2 సంవత్సరాలు లేదా ఆ సభ్యుల యొక్క పిల్లలు ఆ పాఠశాలలో ఉన్నంతవరకు ఇందులో ఏది ముందు అయితే అది, వారి కాలపరిమితిగా పరిగణిస్తారు.

ఎక్స్ అఫీషియో మెంబర్లు:

 ప్రధానోపాధ్యాయుడు/ ఇన్చార్జి ప్రధానోపాధ్యాయుడు(మెంబర్ కన్వీనర్), ఎంఈవోచే నామినేట్ చేసిన అదనపు ఉపాధ్యాయ సభ్యులు(ప్రధానోపాధ్యాయుని జెండర్‌కు వ్యతిరేక సభ్యులు అయి ఉండాలి), ఆ ప్రాంత కార్పొరేటర్/ కౌన్సిలర్ వార్డు సభ్యుల యందు ఒకరు, అంగన్‌వాడీ వర్కర్లు, నైబర్ హుడ్ ఏరియాల్లో పనిచేసేవారు, మల్టీపర్పస్ హెల్త్ వర్కర్, గ్రామంలోని /వార్డులోని మహిళా సమైక్య ప్రెసిడెంట్.

కోఆప్షన్ మెంబర్లు:

 విద్యావేత్తలు, పెలాంత్రపిస్టులు, స్వచ్ఛంద సంస్థలు, పాఠశాలకు చేయూత నందించే వారి నుంచి ఇద్దరు సభ్యులను ఎన్నుకోవాల్సి ఉంటుంది.వీరి పదవీకాలం మొదటి మీటింగ్ నుంచి రెండు సంవత్సరాలపాటు కొనసాగుతుంది.

లోకల్ అథారిటీ చైర్ పర్సన్స్:

ఆయా ప్రాంతంలోని సర్పంచ్/ మున్సిపల్ చైర్ పర్సన్/మేయలు ఆయా ప్రాంతాల్లో జరిగే పి.సి మీటింగ్ లకు వారి విచక్షణ మేరకు హాజరవుతారు.

ఉదయం 9 నుంచి 1 గంట వరకు..

ఈనెల 16న అన్ని పాఠశాలల్లో పాఠశాల ప్రధనోపాధ్యాయుడు ఉదయం 10 గంటలకుఎన్నికల నోటిఫికేషన్ జారీ చేస్తారు. .మధ్యాహ్నం 2 గంటల్లోపు ఓటర్ల జాబితాను నోటీసు బోర్డులో ప్రకటిస్తారు.20వ తేదీ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటలోపు ఓటర్ల జాబితాలపై అభ్యంతరాలను స్వీకరించుట, పరిశీలించుట, మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల్లోపు ఓటర్ల తుది జాబితాను పాఠశాల నోటీసు బోర్డులో ప్రకటిస్తారు.22 ఉదయం 7 గంటలనుంచి మధ్యాహ్నం 1 గంటలోపు ఎన్నిక నిర్వహించి తల్లిదండ్రుల కమిటీ సభ్యులు జాబితాప్రకటించాలి.మధ్యాహ్నం 1.30 గంటలకు తల్లిదండ్రుల కమిటీ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నిక పూర్తి చేయాలి. మధ్యాహ్నం 2 గంటల నుంచి 8.30 గంటల మధ్య తల్లిదండ్రుల కమిటీతో ప్రమాణ స్వీకారం పూర్తి చేసి సమావేశాన్ని నిర్వహించాలి.

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top