ఈ నెలాఖరుకు పీఆర్‌సీతో సహా అన్ని సమస్యలు పరిష్కరిస్తాం:
సీఎంఓ అధికారులతో ఉద్యోగ సంఘాల చర్చలు ముగిశాయి. అనంతరం ఉద్యోగ సంఘాల నేతలతో కలిసి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. జగన్ సీఎం అయ్యాక ఉద్యోగుల ప్రాధాన్యం పెరిగిందని, ప్రభుత్వ పథకాల అమలు ఉద్యోగుల భుజస్కంధాలపైనే ఉందని చెప్పారు. సంక్షేమంలో తమ ప్రభుత్వం రెండు అడుగుల ముందే ఉందన్నారు. కరోనా తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందుల్లో పడిందని వివరించారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే చిన్న చిన్న సమస్యలు వచ్చాయని పేర్కొన్నారు. ఈ నెలాఖరుకు పీఆర్‌సీతో సహా సమస్యలను పరిష్కరిస్తామని వెల్లడించారు. ఉద్యోగులు లేనిదే ప్రభుత్వమే లేదని సజ్జల స్పష్టం చేశారు.
ఉద్యోగులు లేనిదే ప్రభుత్వం లేదు...సజ్జలPRC ఈ నెలాఖరికి 18,19 వ తేదీ నుండి అన్ని ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలతో చర్చలు అఫిషియల్ గా జరుపుతాం.
#JAC సభ్యత్వం ఉన్న సంఘాలతో రేపటి నుండి పి ఎస సి గురించి చర్చ జరుపుతారు
# పెన్షన్ జమచేసిన తర్వాతే ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలని కోరారు
# మెడికల్ రియంబర్స్మెంట్ గడువు పొడిగించాలని
# హెల్త్ కార్డులు సక్రమంగా పనిచేయడం లేదని దీని వల్ల ఉద్యోగులు వైద్యునికి చాలా ఇబ్బందులు పడుతున్నారని చర్చించారు
# పెండింగ్ బిల్లులు ఏపీ జి ఎల్ ఐ, పి ఎఫ్, సంపాదిత సెలవులు, మెడికల్ బిల్లలు పెన్షన్ మంజూరు తదితరాలన్నీ వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు
# కాంట్రాక్టు మరియు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్దీకరణ మరియు వారి జీతాలు పెంచాలని కోరారు
# కారుణ్య నియామకాలు ఒక మేళా గా నిర్వహించి ఉద్యోగాలు భర్తీ చేయాలని కోరారు
# కారుణ్య నియామకాల 45 రోజులులోపు భర్తీ చేయాలని కోరారు. కారుణ్య నియామకాలు ఆ శాఖలో ఖాళీలు లేకపోతే కొత్త పోస్టులు సృష్టించేనా నియామకాలు చేపట్టాలన్నారు
విద్యా సంబందించిన చర్చలు :
రెండు JAC లు కలవడం ఉద్యోగులకు మంచిది అని అన్నారు నేడు టీచర్స్ కు సంపాదిత సెలవు మంజూరు చేయాలనీ కోరడం జరిగినది , బోధనకు ఆటంకంగా ఉన్న అనేక ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ రద్దు చేయాలనీ కోరారు వాటిని తగ్గించడానికి ఆలోచిస్తామని హామీ. CPS రద్దు చేయడానికి CM గారు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని కోరారు . కేంద్రం అందిస్తున్న 14% మాచింగ్ గ్రాంట్ అందించాలని కోరారు . 10 నెలల నుండి DA బకాయిలు వారి జీవితాల్లో ఇప్పటికే జమ కాలేదు అని తెలియజేయడం జరిగింది. 2004 కంటే ముందే అపాయింట్ అయిన ఉపాధ్యాయులకు అంటే డిఎస్సీ 2003 ఉపాధ్యాయులు పాత పెన్షన్ అమలు చేయాలని కోరడం జరిగింది. SGT ఉపాధ్యాయుల 30 సంవత్సరాల సర్వీస్ చేసి ఎస్ జి టి గా నే రిటైర్ అవుతున్నారు వారికి ప్రమోషన్లు సక్రమంగా రావట్లేదని తెలియజేయడం జరిగింది.
0 comments:
Post a Comment