UTF Press Note: మున్సిపల్ టీచర్ల సమస్యలపై సుహృద్భావ వాతవరణంలో చర్చలు -యుటియఫ్

           మున్సిపల్ టీచర్ల సమస్యలపై నిన్నటి రోజు (11.10.2021) డైరెక్టర్ ఎం. ఎం. నాయక్ గారు ఇచ్చిన హామీ మేరకు ఈ రోజు (12.10.2021) డిఎంఏ కార్యాలయంలో మున్సిపల్ అధికారులు యుటియఫ్ నాయకత్వం, పిడిఎఫ్ ఎమ్మెల్సీలతో సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిపి నిర్దిష్ట కాలవ్యవధిలో అన్ని సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు యుటియఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు ఎన్.వెంకటేశ్వర్లు, కె.యస్.యస్. ప్రసాద్ ఒక ప్రకటనలో ఇచ్చారు.

       మున్సిపల్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు పిఎఫ్ అకౌంట్లు ప్రారంభించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని ప్రభుత్వ అనుమతితో త్వరలో ప్రారంభిస్తామని, ఉన్నత పాఠశాలల్లో ఎంతమంది సబ్జెక్టు టీచర్లు అవసరమో అన్ని పోస్టులు అప్గ్రేడ్ చేయడం లేదా కొత్త పోస్టులు మంజూరు చేయించడం చేస్తామని, ప్రధానోపాధ్యాయులతోబాటు స్కూల్ అసిస్టెంట్లకు కూడా ప్రమోషన్ షెడ్యూల్ ప్రకటిస్తామని, జిఓ 77 మున్సిపల్ టీచర్లకు కూడా వర్తింపజేస్తామని, ప్రభుత్వ అనుమతి వచ్చిన వెంటనే బదిలీలు చేస్తామని, ఫైనాన్స్ అనుమతి వచ్చిన వెంటనే రూ.398/-లు వేతనంపై పనిచేసిన ఉపాధ్యాయులకు నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇస్తామని తెలిపారు. మున్సిపల్ ప్రధానోపాధ్యాయులకు డిడిఓ అధికారాలు కల్పించే విషయంలో కొన్ని పరిమితులు ఉన్నందున ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ప్రతి మున్సిపాలిటీలో ఎడ్యుకేషన్ సెల్ ఏర్పాటు చేస్తామన్నారు. విజయవాడ నగరపాలక సంస్థలో ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంపై కమీషనర్ ప్రసన్నకుమార్తో మాట్లాడి సూచనలు ఇచ్చారు. నెల్లూరు, పెద్దాపురం, మంగళగిరి, మార్కాపురం మున్సిపాలిటీలలో ఉపాధ్యాయుల సమస్యలు ప్రత్యేకంగా స్టడీ చేయడానికి ఆదేశాలు ఇచ్చారు. అకడమిక్ ఇన్స్ట్రక్టర్స్ ఉత్తర్వులు త్వరలో పునరుద్ధరిస్తామన్నారు. హామీ పత్రాల టీచర్ల సమస్య, ప్రమోషన్లకు మూడవ మెథడాలాజి పరిగణన, సీనియార్టీ లిస్టుల తయారీ, మండపేట మున్సిపాలిటీ ప్రధానోపాధ్యాయురాలు జి. లత తదితర సమస్యలు పరిష్కారానికి తగు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు.

         సమస్యల పరిష్కారం వేగవంతం చేయడానికి, ఎప్పటికప్పుడు కావలసిన సమాచారం రప్పించేందుకు ప్రతి పదిరోజులకొకసారి సంఘ నాయకులతో చర్చిస్తామని హామీ ఇచ్చారు. ఈ చర్చలలో పిడిఎఫ్ ఎమ్మెల్సీలు కె.యస్.లక్ష్మణరావు, షేక్ సాన్జీ, మున్సిపల్ ఏడిఎంఏ ఆశాజ్యోతి, ఏ.డిలు వెంకట్రామయ్య, సత్యనారాయణ, రవి, సూర్యప్రకాశరావు, అనూరాధ, యుటియఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు ఎన్. వెంకటేశ్వర్లు, కె.యస్.యస్.ప్రసాద్, రాష్ట్ర కార్యదర్శులు ఏ.కృష్ణసుందరరావు, ఎస్.పి. మనోహర్ కుమార్, మున్సిపల్ సబ్ కమిటీ బాధ్యులు టి. అచ్చయ్య, కె. తిరుపతిస్వామి తదితరులు పాల్గొన్నారు.

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top