పీఆర్సీ పై అల్టిమేటం - నేడు CS కు ఉద్యోగ సంఘాల నోటీస్

 ఉద్యోగ సంఘాలు తమ డిమాండ్ల సాధన కోసం ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి అల్టి మేటం జారీ చేయనున్నాయి. ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరా వతి ఐక్యవేదిక నేతలు బొప్ప రాజు, బండి శ్రీనివాసరావు ఉద్యమ కార్యాచరణ నోటీసును బుధవారం ప్రభుత్వ ప్రధానకా ర్యదర్శి సమీర్ శర్మకు అందజేయ నున్నారు. సీపీఎస్ రద్దు, 11వ పీఆర్సీ అమలు, డీఏ బకాయిలు చెల్లింపు, గ్రామసచివాలయ కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ, తదితర అంశాలపై నోటీసు ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. గత కొంతకాలంగా ఈ రెండు సంఘాల ఆధ్వర్యంలో ఉమ్మడి కార్యచరణ ప్రకటించి తమ డిమాండ్ల సాధన కోసం పోరాడుతున్నాయి అందులో భాగంగా ఈరోజు నోటీసు ఇవ్వనున్నారు

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

Top