100 Days LIP Programme Grading - Registers

 జోన్-11 నందు గల అందరి జిల్లా విద్యాశాఖాధికారులకు, ఉప విద్యాశాఖాధికారులకు, మండల విద్యాశాఖాధికారులకు తెలియచేయునది ఏమనగా, లాంగ్వేజ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాం (LIP - 100 రోజుల ప్రోగ్రాం) ను ది. 10.11.2021 నుండి అమలు చేయడంలో భాగంగా క్షేత్ర స్థాయినుండి వచ్చిన సలహాలు మేరకు క్రింది అదనపు మార్గదర్శకములు ఇవ్వడం జరిగినది.

1. తరగతి గది నందు ఏ భాష కు చెందిన ఉపాధ్యాయులు ఆ భాషను మాత్రమే బోధించవలెను. కానీ మూడు భాషలలో ఒకేసారి తరగతి గది బ్లాక్ బోర్డు పై వ్రాసి బోధించడం గమనించడం జరిగినది. ఆ విధంగా చేయరాదు. కేవలం స్కూల్ నోటీసు బోర్డు నందు మాత్రమే మూడు భాషలలో వ్రాయవలెను. తరగతి గది నల్ల బల్ల పై మూడు భాషలు ఒకేసారి వ్రాయకూడదు.

2. ఇప్పటి వరకు 6,7 మరియు 8 తరగతులకు 5 పదములు నేర్పటం జరుగుచున్నది కానీ ది 10 నుండి దీనిని 3 పదములకు తగ్గించడమైనది కనుక 3 పదములు మాత్రమే నేర్పవలెను.

3. ది. 10.11.2021 నుండి ది 30.11.2021 వరకు నేర్పిన పదములు మీద మొదటి పక్షంకు పరీక్షను ది. 01.12.2021 న నిర్వహించవలెను. దీనికి సంబధిత పరీక్షాంశములు ఈ కార్యాలయం నుండి పంపించబడును మరియు ప్రతి పక్ష పరీక్ష నందు పరీక్షించవలసిన పరీక్షాంశములు ఈ కార్యాలయం నుండి పంపించబడును.

4. ప్రతి పక్ష పరీక్ష అనంతరం విద్యార్థుల ప్రగతి కొలమానం గ్రేడింగ్ (స్టూడెంట్ అసెస్మెంట్ గ్రేడింగ్)

9. ప్రధానోపాధ్యాయులు ప్రతి పక్షంలో దీనికి జతపరచిన Annexure-1 లేదా॥ లేదా॥॥ లో నివేదికను సంభందిత MEO వారికి మొదటి పక్షం పరీక్షా నివేదికను 3వ తేదీలోగానూ, రెండవ పక్షం పరీక్షా నివేదికను 17వ తేదీలలోగానూ పంపవలెను.

10. మండల విద్యాశాఖాధికారి వారి నివేదికను ప్రతి నెల 4 / 19 తేదిలలో Annexure-I, II & II లో నివేదికను సంభందిత జిల్లా విద్యాశాఖాధికారి వారి కార్యాలయం కు పంపవలెను.

11. జిల్లా విద్యాశాఖాధికారులు వారి నివేదిక ను ప్రతి నెల 5/20 తేదిలలో వారి జిల్లా ప్రగతి ని Annexure-I, II & III లో ప్రాంతీయ సంయుక్త సంచాలకులు, పాఠశాల విద్య, జోన్-11, కాకినాడ వారి కార్యాలయం కు సమర్పించవలెను.

12. LIP పదములను విద్యార్ధులచే నల్లబల్ల పై వ్రాయించకూడదు. ఉపాధ్యాయులు మాత్రమే వ్రాయవలెను.

13. LIP ప్రోగ్రాం పై ఒకరోజు నేర్పిన పదములను అమరుసటి రోజు విద్యార్ధుల LIP book లో చూడకుండా వ్రాయించి విద్యార్ధుల చేతనే స్వీయ మూల్యాంకనం చేయించవలెను.

14. LIP ప్రోగ్రాం ను భాషోపాధ్యాయులు మాత్రమే బోధించవలెను.

15, మూడు భాషలు ఒకేచోట వ్రాయించకూడదు. ఒకే పుస్తకం నందు తెలుగుకి 30 పేజీలు, ఇంగ్లీష్ కి 30 పేజీలు, హిందీ కి 30 పేజీలు కేటాయించవలెను.

16. జిల్లా విద్యాశాఖాధికారులు అందరూ తమ జిల్లాలలో LIP ప్రోగ్రాం అమలు కొరకు సెక్రటరీ, DCEB వారిని నోడల్ అధికారి గా నియమించవలెను. వారి ద్వారానే రిపోర్ట్ స్వీకరించవలెను. 17, జోన్-II పరిధిలో లోగల మండల విద్యాశాఖాధికారులు మరియు ఉప విద్యాశాఖాధికారులు వారానికి 4 పాఠశాలలో LIPకార్యక్రమం అమలును పరిశీలించి రిపోర్టును RJD KKD REGION WhatsApp గ్రూప్ నందు పోస్ట్ చేయవలెను.

18. జిల్లా విద్యాశాఖాధికారులు వారానికి కనీసం ఒక పాఠశాల సందర్శించవలెను.కావున జోన్-II నందు గల అందరి జిల్లా విద్యాశాఖాధికారులు పై సుచనలను పాఠశాల స్తాయి వరకు చేరునట్టు గా చ్యరలు తీసుకోని లాంగ్వేజ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాం (LIP - 100 రోజుల ప్రోగ్రాం) ను ది. 10.11.2021 నుండి 31.03.2021 వరకూ విజయవంతంగా అమలు అయ్యే విధంగా చర్యలు తీసుకోనవలసిందిగా ఆదేశించడమైనది.

LIP Programme Words Schedule

LIP Register A4 Sheet 

LIP Programme Grading Records and Registers

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top