పీఆర్సీ ఎప్పుడిస్తారు?,సీపీఎస్‌ను ఎప్పుడు రద్దు చేస్తారు?పథకాల తరహాలో తేదీలు ప్రకటించండి: పీడీఎఫ్ ఎమ్మెల్సీలు
శాసనమండలిలో ఆర్థికశాఖ మంత్రి
నిన్న జరిగిన శాసనమండలి సమావేశాల్లో ఉద్యోగులకు సంబంధించిన పి ఆర్ సి గురించి సిపిఎస్ రద్దు గురించి కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ గురించి ఎమ్మెల్సీలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు దీనికి సంబంధించి ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర గారు సమాధానం చెబుతూ పీఆర్సీ ప్రక్రియ కార్యదర్శుల కమిటీ పరిశీలనలో ఉందని, కాంట్రిబ్యూటరీ పెన్షన్ పై కమిటీలు వేశామని ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా మారిందని, ముందుగా పూటగడవని 90శాతం మంది సంక్షేమానికి తొలిప్రాధాన్యం ఇచ్చామన్నారు.
పీఆర్సీపై పలు సమావేశాలు జరిగాయని, జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ కూడా వేశామన్నారు. నివేదిక కార్యదర్శుల కమిటీ పరిశీలనలో ఉందన్నారు.సిపిఎస్ పై మంత్రులు, సీఎస్ అధ్యక్షత వర్కింగ్ కమిటీ ఏర్పాటు చేశామన్నారు. కేఏ పండిట్ కమిటీని కూడా వేశామన్నారు.కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడానికి కమిటీలు వేశామని తెలిపారు.2018 డీఎస్సీ ఉద్యోగులకు సాఫ్ట్‌వేర్ సమస్య వల్లే జీతాలు రాలేదని, సరిచేస్తామని హామీ ఇచ్చారు.
కోవిడ్ సమయంలో ఉపాధి, ఆదాయం కోల్పోయిన పేదలను ఆదుకోవడానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇచ్చిందని చెప్పారు. పరిస్థితులు చక్కబడిన వెంటనే ఉద్యోగుల సంక్షేమానికి పెద్ద పీట వేస్తామన్నారు. పెండింగ్‌లో ఉన్న కరువు భత్యాన్ని కూడా దశలవారీగా ఇస్తామని చెప్పారు.
సీఎంకు ఉద్యోగులంటే గౌరవం ఉందని, సహకరించాలని కోరారు
0 comments:
Post a Comment