గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు శుభవార్త.... ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం జగన్

 


గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు శుభవార్త.... ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు శుభవార్త. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తాను ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు.గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రోబేషన్ డిక్లరేషన్ ప్రక్రియను ప్రారంభించారు. దాంతో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు అంతా ఎదురుచూస్తున్న సమయం వచ్చేసినట్లయింది. కాగా, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్ ప్రక్రియను ఇవాళ విశాఖ జిల్లా వేదికగా ప్రారంభించారు. జిల్లాలోని వి. మాడుగుల, దేవరాపల్లి, రావికమతం మండలాల పరిధిలోని దాదాపు 30 మంది వెల్ఫేర్ అసిస్టెంట్ ల ప్రోబెషన్ డిక్లేర్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.

ముఖ్యమంత్రి మాట ఇచ్చిన విధంగానే రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లేర్ చేయాలని ప్రభుత్వం సెప్టెంబర్ 29 వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటి నుంచి క్షేత్ర స్థాయిలో ఈ ఉత్తర్వుల అమలు కోసం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ మరియు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం ఉన్నతాధికారులను కలిసి కోరారు. ఈ క్రమంలోనే ఉద్యోగుల ఆకాంక్ష నెరవేరేలా మొదటి అడుగు విశాఖ జిల్లా వేదికగా పడింది. ప్రభుత్వ నిర్ణయంపై గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులందరూ ముఖ్యమంత్రి జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేసి, ప్రజలకు మెరుగైన సేవలు అందించి, ప్రజలలో ప్రభుత్వ ప్రతిష్టను మరింత పెంచుతామని, ముఖ్యమంత్రి పేరును నిలబెట్టి ఆయన రుణం తీర్చుకుంటామని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు అన్నారు.

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Telugu & English News Papers SSC Model Papers More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top