Central Govt: ఉద్యోగులకు గుడ్ న్యూస్... మరోసారి డి ఎ, హెచ్ ఆర్ ఎ పెంపు...

Central Govt Employees May Get a DA Hike Soon: మరో 20 రోజుల్లో కొత్త సంవత్సరం రానుంది. సాధారణంగా కొత్త సంవత్సరం (New Year 2022) అంటేనే అందరూ ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు.అయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ సారి ఆ ఉత్సాహం రెట్టింపు కానుంది. ఎందుకంటే.. ప్రభుత్వం వచ్చే ఏడాది జనవరి నుంచి డియర్​నెస్ అలెవెన్స్​ (డీఏ), హౌజ్​ రెంట్​ అలవెన్స్​ (హెచ్​ఆర్​ఏ) పెంచనున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం.. జనవరిలో ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ (Dearness Allowance Hike) 3 శాతం మేర పెరగొచ్చని తెలిసింది. అదే నిజమైతే ఉద్యోగులకు మరోసారి వేతనాలు భారీగా పెరగనున్నాయి. లక్షలాది మంది ఉద్యోగుల అభ్యర్థన మేరకు కేంద్రం హెచ్​ఆర్​ఏ పెంపుపై (HRA Hike) కూడా కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది.

అయితే కేవలం హెచ్​ఆర్​ఏ మాత్రమే పెంచితే.. అది రైల్వై ఉద్యోగులకు మాత్రమే ఉపయోగపడే అవకాశముంది. ఎందుకంటే.. హెచ్ఆర్​ఏ పెంచమని అభ్యర్థనలు పంపిన వారిలో.. ఇండియన్ రైల్వే టెక్నికల్ సూపర్​వైజర్స్ అసోసియేషన్​ నేషనల్​ ఫెడరేషన్ ఆఫ్ రైల్వేమెన్​ సంఘాలు మాత్రమే ప్రధానంగా ఉన్నాయి.

హెచ్​ఆర్​ఏతో పాటు డీఏ కూడా పెంచితే.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరిరకి భారీగా వేతనాలు (Central Govt Employee Salaries ) పెరిగే అవకాశం ఉంది.

హెచ్​ఆర్​ఏ పెంపు ఇలా ఉండొచ్చు..

దేశంలోని నగరాలను కేంద్రం X, Y, Z అనే మూడు కేటగిరీలుగా విభజించింది.

ఒక వేళ కేంద్రం హెచ్​ఆర్​ఏపై కేంద్రం నిర్ణయం తీసుకుంటే.. X​ కేటగిరీ నగరాల్లో ఉండే వారికి రూ.5,400, Y-కేటగిరీలో పట్టణాల్లో ఉండే వారికి రూ.3,600, Z-కేటగిరీ టౌన్లలో ఉండే ఉద్యోగులకు రూ.1,800 చొప్పున పెంపు ఉండొచ్చని తెలుస్తోంది.

ప్రస్తుతం డీఏ ఇలా..

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం 31 శాతం డీఏ వస్తోంది. ఉద్యోగుల గతంలో పెంచిన డీఏ విడుదలపై కేంద్రం ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. త్వరలోనే ఈ మేరకు ప్రకటన ఉండొచ్చని తెలుస్తోంది.

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top