PRC గురించి కొనసాగుతున్న సంప్రదింపులు - ఉద్యోగ సంఘాలతో ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ రేపు భేటీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో Prc పై పీటముడి కొనసాగుతూనే ఉంది. పీఆర్సీ ఫిట్‌మెంట్ పై ఇంకా స్పష్టత రాలేదు. సీఎస్ Sameer Sharma నేతృత్వంలోని కార్యదర్శుల కమిటీ సిఫారసు చేసిన 14.29 చేసిన ఫిట్‌మెంట్ ను ఉద్యోగ సంఘాల నేతలు అంగీకరించడం లేదు. దీంతో ఉద్యోగ సంఘాల నేతలతో ప్రభుత్వం చర్చలు చేస్తోంది.పీఆర్సీపై Employees Union నేతలు ఇప్పటికే ఆందోళన బాట పట్టాయి.అయితే ఆందోళన చేస్తున్న ఉద్యోగ సంఘాల నేతలతో ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుSajjala Ramakrishna Reddy ఏపీ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి Buggana Rajendranath Reddy రెండు విడతలుగా చర్చించారు. ఈ చర్చల తర్వాత ఆందోళనను ఉద్యోగ సంఘాలు విరమించాయి. పీఆర్సీ ఫిట్‌మెంట్ పై ఇంకా స్పష్టత రాలేదు.ఈ విషయమై ఉద్యోగ సంఘాల నేతలతో సజ్జల రామకృష్ణారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిలు జరిపిన చర్చల సారాంశాన్ని సీఎం Ys Jagan కు వివరించారు. రెండు రోజులుగా పీఆర్సీ ఫిట్ మెంట్ విషయమై సీఎం జగన్ తో సజ్జల రామకృష్ణారెడ్డి చర్చిస్తున్నారు. సోమవారం నాడు అర్ధరాత్రి వరకు కూడా ఇదే విషయమై చర్చించారు. అయితే ఆర్ధికేతర అంశాలను పరిష్కరించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. దీంతో ఈ దిశగా అధికారులు చర్యలు తీసుకొంటారు.
ఫిట్‌మెంట్ పై ఉద్యోగ సంఘాలు చేస్తున్న డిమాండ్ కు అనుగుణంగా ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకొంటుందా లేదా అనేది ప్రస్తుతం చర్చ సాగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని పీఆర్సీ ఫిట్ మెంట్ పై డిమాండ్ చేయాలని ఉద్యోగ సంఘాల నేతలకు ఏపీ ప్రభుత్వం సూచిస్తోంది. ఉద్యోగ సంఘాలతో చర్చల సమయంలో సజ్జల రామకృష్ణారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిలు ఇదే విషయమై సూచించారు. అయితే ఐఆర్ కంటే ఫిట్ మెంట్ ను తక్కువగా ఇవ్వాలనే ప్రతిపాదనపై ఉద్యోగ సంఘాల నేతలు అసంతృప్తితో ఉన్నారు.అయితే ఐఆర్ కంటే ఫిట్ మెంట్ ఎక్కువ ఉండేలా చూడాలని ఏపీ సీఎం జగన్ అధికారులకు సూచించారు. దీంతో ఈ మేరకు కొత్త ప్రతిపాదనలతో ముందుకు రావాలని అధికారులకు సీఎం జగన్ సూచించారు. దీంతో ఈ దిశగా అధికారులు ప్రతిపాదనలు సిద్దం చేస్తున్నారు.
అయితే ఉద్యోగ సంఘాల నేతలతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ రేపు సమావేశం కానున్నారు.ఈ సమావేశంలో సీఎస్ తో చర్చల ఆధారంగా భవిష్యత్తు కార్యాచరణపై ఉద్యోగ సంఘాలు నిర్ణయం తీసుకోనున్నాయి. ప్రభుత్వం వైపు నుండి వచ్చే ప్రతిపాదనల ఆధారంగా ఆందోళనల విషయమై నిర్ణయం తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు బావిస్తున్నాయి.క్రిస్‌మస్ పర్వదినానికి ముందుగానేు పీఆర్సీ పై స్పష్టత తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. ఒకవేళ సాధ్యం కాకపోతే నెలాఖరులోపుగా ఉద్యోగ సంఘాల పీఆర్సీ ఫిట్‌మెంట్ పై తేల్చనుంది. ఫిట్ మెంట్ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని ఉద్యోగ సంఘాలు తేల్చి చెబుతున్నాయి. అయితే ఉద్యోగ సంఘాలను సంతృప్తి పర్చేలా ప్రభుత్వం ఫిట్‌మెంట్ ఇస్తోందా లేదా అనేది త్వరలో తేలనుంది
0 comments:
Post a Comment