డిమాండ్ల పరిష్కారం కోసం మరింత ఉద్యమించాలని ఉద్యోగ సంఘాల ఐక్య వేదిక నిర్ణయం
పీఆర్సీపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న ఉద్యోగులు.. తమ డిమాండ్ల పరిష్కారం కోసం మరింత ఉద్యమించాలని తీర్మానించారు. ఉద్యోగ సంఘాల ఐక్య వేదిక నిర్ణయం మేరకు సమ్మె చేయాలని నిర్ణయించాయి.ఈ మేరకు శుక్రవారం భేటీ అయిన ఉద్యోగ సంఘాల నేతలు బండి శ్రీనివాసులు, సూర్యనారాయణ, బొప్పరాజు వెంకటేశ్వర్లు, వెంకట్రామిరెడ్డి సమ్మెతేదీలపై నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం సాయంత్రం సీఎస్ కు సమ్మె నోటీసులు ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి.ఈ మేరకు ఉద్యమ కార్యాచరణను కూడా ఉద్యోగ సంఘాలు ఖరారు చేశాయి. ఈనెల 25న రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడి చేయపట్టాలని నిర్ణయించాయి. అలాగే వచ్చేనెల 3వ తేదీన చలో విజయవాడ.. ఫిబ్రవరి 7 లేదా 8వ తేదీ నుంచి సమ్మెకు వెళ్లాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి.
ఉద్యోగులకు నచ్చచెప్పే ప్రయత్నం కి ప్రభుత్వం ముందడుగు
ఉద్యోగులకు నచ్చజెప్పేందుకు ప్రత్యేక కమిటీ
ప్రత్యేక కమిటీని నియమించిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి
ఉద్యోగులకు పిఆర్సి నచ్చ చెప్పేందుకు ఐదుగురు సభ్యుల కమిటీ ఏర్పాటు
పేర్ని నాని, సజ్జల, బొత్స, బుగ్గన రాజేంద్రనాథ్ తో పాటు సీఎస్ సభ్యులుగా కమిటీ ఏర్పాటు
0 comments:
Post a Comment